ఉమ్మడి కర్నూలులో.. పసుపు,అరటికి ఇన్సూరెన్స్ లేనట్లే ..!
1 min read
Banana Plantation on the West Coast of Martinique with a bunch of ripe bananas
పల్లెవెలుగు వెబ్, మహానంది: ఉమ్మడి కర్నూలు జిల్లాలో పసుపు మరియు అరటి పంటలకు ఇన్సూరెన్స్ సౌకర్యం లేనట్లేనని సమాచారం .నూతనంగా మొక్కజొన్న పంటకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించారు .ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నపసుపు మరియు అరటి పండించే అన్నదాతకు నిరాశ మిగిలిపోయింది. ఈస్ట్ ,వెస్ట్ గోదావరి జిల్లాలతోపాటు కోనసీమ ప్రాంతంలోఅరటి పంటకు ఇన్సూరెన్స్ సౌకర్యం ప్రభుత్వం కల్పించింది .నంద్యాల డివిజన్ లోని మహానంది మండలం నందు అరటి మరియు పసుపు పంటలను పండిస్తున్నారు .ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోతున్న అన్నదాతలకు ఇన్సూరెన్స్ సౌకర్యం ఎంతో ఉపయోగకరంగా ఉన్నా కొన్ని ప్రాంతాల్లో కొన్ని కొన్ని పంటలకే ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించినట్లు తెలుస్తుంది .మహానంది మండలంలో కూడా అరటి మరియు పసుపు పంటలను ఇన్సూరెన్స్ జాబితాలో చేర్చాలని పలువురు రైతులు కోరుతున్నారు .హార్టికల్చర్ అధికారులు కూడా సంబంధించి నివేదికలను ప్రభుత్వానికి పంపినట్లు సమాచారం .ప్రజాప్రతినిధులు స్పందించి రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు .పంట నష్టపరిహారం అయితే ఉంది కానీ అది ఏ మూలకు సరిపోదని రైతులు వాపోతున్నారు .కొన్ని పంటలను జిల్లా యూనిట్గా ను మరి కొన్ని పంటలను మండలం యూనిట్ గా తీసుకున్నారు.
