జొలదరాశిలో ..గడపగడపకు మన ప్రభుత్వం
1 min read
పల్లెవెలుగు, వెబ్ బనగానపల్లె : నియోజకవర్గం కోవెలకుంట్ల మండలం పరిధిలోని జొలదరాశి గ్రామంలో ఈనెల 20వ తేదీ గురువారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించనున్నట్లు వైసిపి జిల్లా ప్రచార కార్యదర్శి సిద్ధం రెడ్డి రామ్మోహన్ రెడ్డి బుధవారం తెలిపారు. గురువారం మధ్యాహ్నం రెండు గంటలకు గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం మొదలవుతుందని ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి,వివిధ శాఖల అధికారులు హాజరవుతారని తెలిపారు. వైసిపి నాయకులు,కార్యకర్తలు, వివిధ శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటరీలు తదితరులు ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని రామ్మోహన్ రెడ్డి కోరారు.