కారుమంచిలో…ఉసేన్ వలి తాత ఉరుసు 
1 min readపల్లెవెలుగు వెబ్, ఆస్పరి: మండల పరిధిలోని కారుమంచి గ్రామంలో కొలిచిన వారికి కొంగు బంగారంగా వెలసిన శ్రీశ్రీ నేముటూరు ఉసేన్ వలి తాత ఉరుసు ఉత్సవాలు 23వ తేదీ బుధవారం నుండి 25వ తేదీ శుక్రవారం వరకు మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు సర్పంచ్ లక్ష్మి ,వైస్ ఎంపీపీ చంద్రకళ ,గ్రామ పెద్దలు మురళీధర్ రెడ్డి, రవి రెడ్డి, కౌలుట్లయ్య, రాజన్న గౌడ్, ఆత్మానంద, తెలిపారు. 23వ తేదీ బుధవారం గంధం 24వ గురువారం తేదీ ఉరుసు 25వ తేదీ శుక్రవారం జియారత్తో దర్గాలో స్వామివారికి ప్రత్యేక పూజలు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు. ఉసేన్ స్వామి ఉరుసు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వారు తెలిపారు. ఈ మూడు రోజులపాటు జరిగే ఉరుసు ఉత్సవాలకు స్వామి వారి దర్గాను రంగు రంగుల విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. ఉరుసు ఉత్సవానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకుంటారు మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలలో గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్ఐ ముని ప్రతాప్ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.