PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కర్నూలు ‘కిమ్స్​’లో … కొత్త ఎముకల తొలగింపు..

1 min read

– చీల‌మండ‌ చుట్టూ ప‌ద‌కొండు కొత్త ఎముక‌లు

– అత్యాధునిక పరికరాలతో తొలగింపు..

పల్లెవెలుగు వెబ్​: చీల‌మండ‌ చుట్టూ పుట్టుకొచ్చిన రాళ్లలాంటి ప‌ద‌కొండు కొత్త ఎముక‌ల‌ను విజ‌య‌వంతంగా తొల‌గించారు కిమ్స్ క‌ర్నూలు వైద్యులు. క‌ర్నూలు జిల్లాలో ఇలాంటి శ‌స్త్రచికిత్స చేయ‌డం జిల్లాలో ఇదే మొద‌టిసారి కావ‌డం విశేషం.  పాదం చుట్టూ కొత్త ఎముక‌లు ఎలా పుట్టుకొచ్చాయి, వాటి ఏ ప‌ద్దతిలో తొలిగించార‌నే విష‌యాల‌ను మీడియాకు వెల్లడించారు కిమ్స్ హాస్పిట‌ల్స్ ప్రముఖ ఆర్థోపెడిక్ స‌ర్జన్ డాక్టర్. కిర‌ణ్‌కుమార్‌.

పాదంలో నొప్పి రావడంతో..:

అనంత‌పురం జిల్లా గోరుంట్ల ప్రాంతానికి చెందిన మ‌హేంద్ర (37) వృతిరీత్య ఎలక్ట్రీషియన్. ఆరేళ్ల క్రితం ఇంట్లో ప‌నిచేస్తుండ‌గా స్టూల్ మీద నుండి జారి ప‌డ్డాడు. దీంతో అత‌ని పాదానికి వాపు వ‌చ్చి నొప్పిగా మారింది. దానిని సాధార‌ణ వాపు భావించి మాసాజ్ చేయించి వ‌దిలేశాడు. అయితే గ‌త ఆరు నెల‌ల క్రితం నుండి తిరిగి అతనికి మ‌ళ్లీ పాదంలో నొప్పి రావ‌డంతో అనంత‌పురం, నంద్యాల, ఆత్మకూర్‌ల‌లో ప‌లు హాస్పిట‌ల్స్ తిరిగిన ఫ‌లితం లేకపోవ‌డంతో క‌ర్నూలులోని కిమ్స్ హాస్పిట‌ల్స్​కు  వ‌చ్చాడు. అప్పుడు అత‌ని పాదాన్ని ప‌రిశీలించి స్కాన్ చేశాం. ఈ స్కాన్‌లో అత‌ని కుడికాలు పాదం చుట్టూ ప‌ద‌కొండు ఎముక‌లు రాళ్ల మాదిరిగా పుట్ట‌కొచ్చిన విష‌యాన్ని గుర్తించాం. దీంతో రోగి న‌డిచేట‌ప్పుడు, ఏదైన బ‌రువులు ఎత్తిన‌ప్పుడు, కాలు అటు, ఇటు తిప్పిన‌ప్పుడు తీవ్ర‌మైన నొప్పితో బాధ‌ప‌డేవాడు.  రోగి పూర్తిగా సాధార‌ణ స్థితిలో న‌డ‌వాలి అంటే ఖచ్చితంగా స‌ర్జరీ చేయాల‌ని వివ‌రించాం. అన‌ంతరం అత‌నికి యాంకిల్ ఆర్థోస్కోపీ విత్ లూస్ బాడీ రీమువ‌ల్ స‌ర్జరీ ద్వారా చీల‌మండ చుట్టూ రాళ్ల‌లాగా కొత్తగా పుట్టుకొచ్చిన ఎముక‌ల‌ను విజ‌య‌వంతంగా తొల‌గించి ఉప‌శ‌మ‌నం క‌లిగించాం.

కొత్త ఎముకలు ఎలా పుడతాయంటే…:

అయితే ఇలా కొత్త ఎముక‌లు పుట్టడానికి రెండు ర‌కాల ప్రధాన కార‌ణాలు ఉంటాయి. అవి ఏటంటే సైనోవియల్ కొండ్రోమాటోసిస్ (సైనోవియల్ ఆస్టియోకాండ్రోమాటోసిస్ అని కూడా పిలుస్తారు) అనేది అరుదైన వ్యాధి.  ఇది సైనోవియమ్ (కీళ్ల ఎముక పొర‌)ను కలిగి ఉంటుంది. ఇది కీళ్లను లైన్ చేసే కణజాలం యొక్క పలుచని పొర. సైనోవియల్ కొండ్రోమాటోసిస్ శరీరంలోని ఏదైనా జాయింట్‌లో తలెత్తవచ్చు. ఇది సాధారణంగా మోకాలిలో సంభవిస్తుంది. కానీ ఇత‌నిలో మాత్రం కుడికాలు చీల‌మండ‌లో సంభ‌వించింది. ఇలా కొత్త‌గా ఎముక‌లు పుట్ట‌డం అప్పుడ‌ప్పుడు గాయాల‌తో కూడా సంభ‌విస్తుంది. అయితే ఇత‌నిలో మాత్రం ఆరు సంవ‌త్సరాల త‌ర్వాత రావ‌డం అనేది అరుదుగా జ‌రిగింది. దీంతో అత‌ని తీవ్రమైన నొప్పితో బాధ‌ప‌డేవాడు. అయితే వీటిని తొల‌గించ‌డానికి ఓపెన్ స‌ర్జరీ ద్వారా కూడా చేయ‌వ‌చ్చు. అయితే రోగికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆర్థోస్కోపీ ద్వారా స‌ర్జరీ చేశాం. ఇప్పడు అత‌ను పూర్తిగా కోలుకొని చ‌క్కగా న‌డ‌వ‌గ‌లుతున్నాడు అలాగే ప‌రిగెత్తగ‌లుగుతున్నాడు.

కర్నూలులో మొదటి సారి…:

ఇలాంటి శ‌స్త్రచికిత్స చేయ‌డం క‌ర్నూలు జిల్లాలో మొద‌టిసారి.  అయితే ఇలాంటి ఆప‌రేష‌న్లు చేయాలంటే మెట్రోన‌గ‌రాలైన హైదారాబాద్ లేదా బెంగుళూరుకి వెళ్లాల్సిన ప‌రిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు అత్యాధునిక ప‌రికాలు కిమ్స్ హాస్పిట‌ల్స్ అందుబాటులో ఉండ‌డం వ‌ల్ల స‌ర్జరీ చేసి రోగి పాదాన్ని కాపాడ‌గలిగాం. ఈ స‌ర్జరీ చేయ‌క‌పోతే మాత్రం భ‌విష్యత్తులో కొత్తగా పుట్టుకొచ్చిన ఎముక‌లు కీలులోప‌లికి వెళ్లి కీలు మొత్తానికి న‌ష్టం జ‌రిగేది. ఆ త‌ర్వాత కీలు మార్పిడి చేయాల్సి వ‌చ్చేది. కానీ ముందుగా గుర్తించ‌డం వ‌ల్ల కీలు మార్పిడి చేయ‌కుండా అత‌న్ని రక్షించాం.

About Author