కర్నూలులో… పోలీసులకు మాబ్ ఆపరేషన్ శిక్షణ..
1 min readపల్లెవెలుగు వెబ్, కర్నూలు: అత్యవసర సమయంలో పరిస్థితిని అదుపులోకి తీసుకొని వచ్చే విధంగా ప్రతి ఒక పోలీసు నిష్ణాతుడు కావాలని ఏఆర్ అడిషనల్ ఎస్పీ జి. నాగబాబు ఆధ్వర్యంలో ఏ ఆర్ పోలీసులు, స్పెషల్ పార్టీ పోలీసులకు మాబ్ ఆపరేషన్ శిక్షణ ఇచ్చారు. రాబోయే రోజుల్లో ఏవైనా సమస్యలు తలెత్తినపుడు సమర్థంగా ఎదుర్కోడానికి సమస్యను అదుపులోనికి తీసుకు వచ్చే విధంగా ప్రతి ఒక్క పోలీసు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఏ ఆర్ అడిషనల్ ఎస్పీ జి నాగబాబు తెలిపారు. సమస్యలు తలెత్తినపుడు జన సమూహంను నివారించేందుకు ఏ విధమైన సమయస్ఫూర్తిని వ్యవహరించాలి, అనే అంశాలపై పోలీసు సిబ్బందికి మాబ్ శిక్షణ నిర్వహించడం జరిగింది. స్టోన్ గాడ్, హెల్మెట్, లాఠీ, మైక్, టియర్ గ్యాస్ ఆయుధం మొదలైన ఇతర పరికరాలు లాఠీఛార్జ్ ఏ సమయంలో చేయాలి, భాష్పవాయువు ప్రయోగాలను ఏలాంటి సందర్భాల్లో అనుసరించాలనే విషయాలపై మాబ్ ఆపరేషన్ శిక్షణ గురించి పోలీసులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా బుధవారం కర్నూల్ నగర సమీపంలోని దిన్నెదేవరపాడు దగ్గర గల జిల్లా పోలీసు శిక్షణ కేంద్రంలో పోలీసులు మాబ్ ఆపరేషన్ డ్రిల్ నిర్వహించారు. ఏ ఆర్ అడిషనల్ ఎస్పీ జి. నాగబాబు గారు మాట్లాడరు సాధారణంగా మాబ్ ఆపరేషన్ డ్రిల్ చేస్తుంటా మన్నారు. భాష్పవాయువు ప్రయోగాల వంటివి సంవత్సరంలో 2 సార్లు చేస్తుంటామన్నారు.రాబోయే రోజుల్లో ఏమైనా శాంతిభద్రతల సమస్యలు తలెత్తినపుడు సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఈ మాబ్ ఆపరేషన్ శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందన్నారు .
పోలీసులకు నిర్వహించిన మాబ్ ఆపరేషన్ శిక్షణ లో…
1) టియర్ స్మోక్ గ్యాస్ గిర్నీట్స్ ఫైర్ చేశారు. 2) టియర్ స్మోక్ స్టన్ గిర్నీట్స్ ఫైర్ చేశారు. 3) టియర్ స్మోక్ నాన్ ఎలక్ట్రికల్ సెల్స్ ఫైర్ చేశారు.
4) రోబోట్ గన్ తో ప్లాస్టిక్ పిలేట్స్ సెల్స్ ఫైర్ చేశారు. 5) వజ్ర వాహనంతో టియర్ స్మోక్ ఎలక్ట్రికల్ సెల్స్ ఫైర్ చేశారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీలు డి ప్రసాద్, జి నాగబాబు, డీఎస్పీ డిటిసి ప్రిన్సిపాల్ శ్రీనివాసులు, ఆర్ ఐ లు రమణ, రవి కుమార్, ఆర్ ఎస్సై లు, ఎ ఆర్ పోలీస్ సిబ్బంది, స్పెషల్ పార్టీ పోలీసులు పాల్గొన్నారు.