కర్నూలులో మంత్రికి నిరసన సెగ !
1 min read
పల్లెవెలుగువెబ్ : కర్నూలు జిల్లాలోని ఆస్పరి మండలం కైరుప్పలలో మంత్రి జయరాంకు నిరసన సెగ తగిలింది. గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి జయరాంను ఖాళీ బిందెలతో మహిళలు అడ్డుకున్నారు. సహనం కోల్పోయిన మంత్రి మహిళ చేతిలోని బిందె లాక్కున్నారు. టీడీపీ, వామపక్షాలు అడిగితే పనులు చేయనని మంత్రి జయరాం పేర్కొన్నారు. మంత్రి జయరాం వ్యాఖ్యలపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.