కర్నూలులో.. విహెచ్పీ దక్షిణ ఏపీ రాష్ట్ర కార్యాలయం ప్రారంభం
1 min read–విశ్వ హిందూ పరిషత్ దక్షిణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యాలయాన్ని ప్రారంభించిన విశ్వహిందూ పరిషత్ కేంద్రీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి కోటేశ్వర శర్మ, జి. రాఘవరెడ్డి, టీ.జీ వెంకటేష్, టి రామారావు లు.
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూల్ నగరంలో రెవెన్యూ కాలనీలోని శ్రీ భరతమాత దేవాలయం వెనక విశ్వ హిందూ పరిషత్ దక్షిణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యాలయాన్ని విశ్వహిందూ పరిషత్ కేంద్రీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి కోటేశ్వర్ శర్మ, జి పుల్లారెడ్డి చారిటీస్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ జి.రాఘవరెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యులు టీ.జీ వెంకటేష్, భగవాన్ శ్రీ బాల సాయిబాబా సెంట్రల్ ట్రస్ట్ చైర్మన్ టి రామారావు ల చేతుల మీదుగా ప్రారంభించారని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు నంది రెడ్డి సాయి రెడ్డి తెలిపారు. ముందుగా ముఖ్య అతిథులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి భరతమాత దేవాలయంలో ప్రత్యేక పూజలు అనంతరం విశ్వహిందూ పరిషత్ దక్షిణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ప్రారంభోత్సవ పూజా కార్యక్రమం,సమావేశం లో పాల్గొన్న విశ్వహిందూ పరిషత్ కేంద్రీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి కోటేశ్వర్ శర్మ మాట్లాడుతూ విశ్వహిందూ పరిషత్ కార్యక్రమాలు ఇకనుండి కర్నూలు కేంద్రంగా దక్షిణ ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలోని రాయలసీమ జిల్లాలు, ఉమ్మడి నెల్లూరు ప్రకాశం జిల్లాలకి దిశా నిర్దేశనం ఉంటుందని తెలుపుతూ విశ్వహిందూ పరిషత్, బజరంగదళ్, దుర్గా వాహిని, మాతృమండలి ఇతర ధార్మిక సంస్థల యొక్క కార్యకలాపాలు కర్నూలు నుండి ప్రారంభమవుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సోమిశెట్టి వెంకటరామయ్య, బజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ టీ ప్రతాపరెడ్డి, విశ్వహిందూ పరిషత్ నాయకులు సందడి మహేష్ బసవన్న గౌడ్, వై.ఎన్.రెడ్డి, డాక్టర్ లక్కి రెడ్డి సమరసింహారెడ్డి, టి సీ మద్దిలేటి, ఈపూరి నాగరాజు తదితరులు తెలుగు భగీరథ, సాయిరాం, రాము, భాస్కర్, గురుమూర్తి,పాల్గొన్నారు.