అక్షరాస్యతలో… కర్నూలు ను అగ్రగామీగా నిలపాలి
1 min read
డిఆర్ఓ సి.వెంకట నారాయణమ్మ
కర్నూలు, న్యూస్ నేడు: జిల్లాలోనీ నిరక్షరాస్యులు అందరిని అక్షరాస్యులుగా తీర్చిదిద్ది.. అక్షరాస్యతలో అగ్రగామిగా నిలపాలని డిఆర్ఓ సి.వెంకట నారాయణమ్మ తెలిపారు.బుధవారం జిల్లా రెవెన్యూ అధికారి ఛాంబర్ లో వయోజన విద్య శాఖ ఆధ్వర్యంలో “ఉల్లాస్” కార్యక్రమం అమలుపై డిఆర్ఓ జిల్లా స్థాయి కన్వర్జెన్స్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ “ఉల్లాస్” కార్యక్రమం ద్వారా నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చేందుకు చర్యలు చేపట్టాలన్నారు… గత ఏడాది “ఉల్లాస్” కార్యక్రమం మొదటి స్పెల్ లో 28 వేల 872 మందికి గాను 27 వేల 200 మంది ఎఫ్ఎల్ఎన్ఏ (ఫండమెంటల్ లిటరసీ అండ్ న్యూమరసి అసెస్మెంట్ టెస్ట్) కి హాజరయ్యారని అందులో 25 వేల 257 మంది సక్సెస్ అయ్యారన్నారు… అదే విధంగా ఈ ఏడాది 30, 005 మందికి అక్షరాస్యతను నేర్పించాలని లక్ష్యాన్ని నిర్దేశించారన్నారు. అర్బన్ లో 50 శాతం రూరల్ లో 50 శాతం మందిని గుర్తించాలన్నారు. ఉల్లాస్ కార్యక్రమం కింద ఏప్రిల్ 16 నుండి ఏప్రిల్ 24 వరకు 9 రోజులపాటు సర్వే మొదలుపెట్టి నిరక్షరాస్యులను గుర్తించాలన్నారు…అనంతరం వారిని గుర్తించిన తర్వాత మే 05 వ తేది నుండి సెప్టెంబర్ 18 వరకు టీచర్లతో క్లాస్ లు నిర్వహించి సెప్టెంబర్ 21 వ తేదీన ఎఫ్ఎల్ఎన్ఏ (ఫండమెంటల్ లిటరసీ అండ్ న్యూమరసి అసెస్మెంట్ టెస్ట్) నిర్వహించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.. ఇందుకోసం అంగన్ వాడి కేంద్రాలు, కమ్యూనిటీ సెంటర్లను సాయంత్రం రెండు గంటల పాటు అక్షరాస్యత కేంద్రాల కోసం వినియోగించాలన్నారు.వయోజన విద్య శాఖ డిడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఉల్లాస్ కార్యక్రమం కింద స్వయం సహాయక బృందం (ఎస్.హెచ్.జి) సభ్యులు, వంటవారు, సహాయకులు, ప్రభుత్వ రాత్రి వాచ్మెన్, ప్రభుత్వ సహాయక పాఠశాలలు, అంగన్వాడీ సహాయకులు/ ఆయాలు మరియు ఎన్ఆర్ఈజిఎస్ కార్మికులలో క్రియాత్మక అక్షరాస్యత, ఆర్థిక అక్షరాస్యత మరియు డిజిటల్ అక్షరాస్యత సాధించడంపై దృష్టి సారించి ఈ కార్యక్రమం వినూత్నంగా అమలు చేయబడుతోందన్నారు. 2025-26లో జిల్లాలో మొత్తం 30,005 మందికి అక్షరాస్యతను నేర్పించాలని లక్ష్యంను నిర్దేశించడం జరిగిందన్నారు. అందుకు అనుగుణంగా లక్ష్యాన్ని చేరుకునేందుకు తగిన సహాయ సహకారాలను అన్ని శాఖల వారు అందించాలన్నారు. సమావేశంలో సమాచార శాఖ ఉప సంచాలకులు కె.జయమ్మ, జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్, డీఆర్డీఏ ఏపిడి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.