PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మహానందిలో.. ప్రైవేటు లాడ్జిల కట్టడికి చర్యలేవీ..?

1 min read

పల్లెవెలుగువెబ్​,: కర్నూలు జిల్లా మహానంది క్షేత్రం లోపుట్టగొడుగుల్లా వెలుస్తున్న  ప్రైవేటు లాడ్జిల కట్టడి కి చర్యలు శూన్యం అనే ప్రచారం జరుగుతుంది .మహానంది దేవస్థానం కు చెందిన వసతి గృహాలు ఉన్న వాటి నిర్వహణ సరిగా లేకపోవడంతో క్షేత్రం పరిధిలో ప్రైవేటు లాడ్జిలయజమానులకు కాసుల వర్షం కురుస్తున్న ట్లు  సమాచారం ..పోటాపోటీగా ప్రవేటు లాడ్జి యజమానులు తమ బంట్రోతు ల ద్వారా యాత్రికులను తమ లాడ్జి లకు తరలిస్తూ అధిక మొత్తంలో వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి .అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా యాత్రికుల కోసం పోటాపోటీగా క్షేత్ర పరిధిలో తమ అనుచరులను తిప్పుతూ ఆలయ పర్యవేక్షణలో ఉన్నటువంటి వసతి గృహాలకు యాత్రికులు వెళ్లకుండా ఎక్కడికి అక్కడ కట్టడి చేస్తూ ప్రైవేట్ వ్యాపారానికి అధికారిక దర్పం తోడు అవడంతో ఆలయ ఆదాయానికి గండి పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి .కొందరు ఆలయంలో పనిచేసే వ్యక్తులుమరియు  ఆలయ అభివృద్ధికి నిరంతరం పాటుపడుతమని కీలక స్థానంలో ఉన్నటువంటి వారే  ప్రైవేటు వ్యక్తులకు ప్రోత్సాహాన్ని అందజేస్తూ తమ ఉనికిని చాటుకుంటున్నారనే విమర్శలు వినవస్తున్నాయి . దేవస్థానం భూమి కూడా ఉపయోగించుకుంటూ లాడ్జిలు నిర్వహించడం అధికారులకు కనిపించడం లేదా… అని పలువురు ప్రశ్నిస్తున్నారు. దేవస్థాన కాలనీ పేరుతో ఏర్పాటయిన ఇళ్ల పేరుతో  కూడా లాడ్జిలు గా అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న వారిపై ఎలాంటి చర్యలు సంబంధిత  అధికారులు తీసుకోకపోవడం పలు విమర్శలకు తావిస్తుంది ..ఇప్పటికే ఆలయ పరిధిలో మరియు బయట పుట్టగొడుగుల్లా అనుమతులు లేకుండా ప్రైవేటు లాడ్జిలు ఉన్న వాటిపై ఎవరు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.

About Author