‘మహానంది ఎంపీడీఓ’లో.. ద్విపాత్రాభినయం ..
1 min readపల్లెవెలుగువెబ్, మహానంది: మహానంది మండల పరిషత్ కార్యాలయంలో ఓ అధికారి ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు విమర్శలు వినవస్తున్నాయి .దాదాపు నాలుగు సంవత్సరాలు పైనే తిష్ట వేసిన ఆ అధికారి సూపరిండెంట్ గా విధులు నిర్వహిస్తున్న వారు .దీంతోపాటు రెండు సంవత్సరాలు పైనే ఉన్నతాధికారిగా వ్యవహరిస్తున్నారు .ఉన్నత అధికారి గా వ్యవహరిస్తున్న పెద్దలు చెప్పని దే పేదలకు అందాల్సిన సంక్షేమ పథకాలు ఇతరములు ఏవీ కూడా ముందుకు కదలడం లేదని ఆరోపణలు వినవస్తున్నాయి .రెగ్యులర్గా ఉన్నత అధికారి లేకపోవడంతో ఏ పనులు ముందుకు సాగడం లేదని సమాచారం అయినవారికి ఆకుల్లో కానివారికి కంచాల్లో అన్న చందంగా వ్యవహరిస్తున్నట్లు ఆయా గ్రామాల్లో ప్రజలు చర్చించుకుంటూ ఉన్నట్లు తెలుస్తుంది .కొందరు అండదండలతో ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు సమాచారం .రెగ్యులర్ అధికారులను నియమించాలని పలువురు కోరుతున్నారు .మండల పరిషత్ కార్యాలయంలో ఓ ప్రైవేటు వ్యక్తి అన్నీ తానై వ్యవహరిస్తున్న చూస్తూ ఊరుకోవడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.మహానంది మండల పరిషత్ సర్వసభ్య సమావేశంగత కొన్ని రోజుల క్రితం కోరం లేకున్నా ఇద్దరు ఎంపీటీసీ లతో నిర్వహించడం పలు విమర్శలకు తావిస్తోంది.కనీసం ఎంపిటిసి లకు ఎలాంటి సమాచారం ఇవ్వక పొగ సభ నిర్వహణ లో పలు లోపాలయందు అంతర్యం ఏమిటోనని పలువురు చర్చించుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.