‘మలబార్’లో… ఆర్టిస్ర్టీ బ్రాండెడ్ జ్యువలరీ ప్రదర్శన
1 min read
పల్లెవెలుగు వెబ్, కర్నూలు: వాణిజ్యరంగంలో ప్రపంచంలోనే ప్రథమస్థానంలో ఉన్న మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ సంస్థ బంగారు ప్రియుల కోసం ఆర్టిస్ర్టీ బ్రాండెడ్ జ్యువలరీ షో కార్యక్రమాన్ని నిర్వహించింది. శనివారం కర్నూలు షోరూం హెడ్ ఫయాజ్, అసిస్టెంట్ హెడ్ చేతన్ కుమార్, మార్కెటింగ్ మేనేజర్ నూర్వుల్లా అధ్యక్షతన నిర్వహించిన ఆర్టిస్ర్టీ బ్రాండెడ్ జ్యువలరీ షో కార్యక్రమాన్ని ముఖ్య అతిథులు అక్షిత, అమృత, అజిత, ఫాతీమా, శిల్పా ప్రారంభించారు. షోలో అత్యంత కళానైపుణ్యం… హుందాతనంతో తయారు చేసిన విశిష్ట ఆభరణాలను ప్రదర్శించారు. అందులో భాగంగా మలబార్ గోల్డ్ వారి బ్రాండ్ల సమాహారం ‘మైన్’ ధ్రువీకరించిన వజ్రాభరణాలు, వివాహం మరియు పార్టీ సంబరాల కోసం ‘ ఎరా’ అన్కట్ వజ్రాలతో పొదిగిన విశిష్ట శ్రేణి, ప్రెష్యా జాతిరత్నాభరణాల సముదాయం, ‘ ఎత్నిక్స్’ హస్తకళా నైపుణ్యతతో తయారైన ఆభరణాలు, ‘ జోల్’ అధునాతన డిజైన్లతో తేలికపాటి ఆభరణాలను ఇష్టపడే మగువల మనస్సు దోచుకుంటాయి. ‘డివైన్’ భారతీయ ప్రాచీన సంప్రదాయం వ్యక్తం చేసే ఆభరణాలు ఇంకా చిన్నారుల కోసం ‘ స్టార్గెట్’ పిల్లల ఆభరణాలు సమకూర్చారు. ఈ ప్రదర్శన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ కర్నూలు షో రూంలో ఈ నెల 18 నుంచి 26వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు స్టోర్ హెడ్ ఫయాజ్ తెలిపారు.