పల్లెవెలుగు వెబ్: వాణిజ్యరంగంలో ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందిన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ సంస్థ ….బంగారు కొనుగోలుదారుల కోసం ఎప్పటికప్పుడు నూతన ఒరవడికి శ్రీకారం చుడుతోంది. వినియోగదారుల అభిరుచులకనుగుణంగా బంగారు ఆభరణాలను కళానైపుణ్యతతో… నాణ్యతగా తయారు చేస్తోంది. సోమవారం కర్నూలు షోరూంలో ‘ అన్కట్ ఆభరణాల ప్రదర్శన’ నిర్వహించింది. వినియోగదారులు భావన, రూప, హారిక ముఖ్య అతిథులుగా విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ సంస్థలో ఎన్నో అద్వితీయమైన… ఆకర్షణీయమైన.. బంగారు వజ్రాభరణాలు సరసమైన ధరలకు లభిస్తాయన్నారు. అన్కట్ ఆభరణాల ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణలుగా మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వారి బ్రాండ్ల సమాహారం, వివాహ మరియు పార్టీ సంబరాల కోసం ‘ ఎరా’ అన్కట్ వజ్రాలతో పొదిగిన విశిష్టశ్రేణి సమకూర్చినట్లు షోరూం నిర్వాహకులు నూర్బాష, సుధాకర్, అజీష్ కుమార్, చేతన్ వెల్లడించారు. తమ సంస్థ వార్షిక ఆదాయంలో నుంచి సామాజిక బాధ్యతగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. అన్కట్ ఆభరణాల ప్రదర్శన ఈ నెల 4 నుంచి 9వ తేదీ వరకు ఉంటుందని, వినియోగదారులు, బంగారు ప్రియులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా నూర్బాష, అజీష్ కుమార్, సుధాకర్ కోరారు.