PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మిడుతూరులో… బెల్లం ఊట ధ్వంసం…

1 min read

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు:నాటుసారా బెల్లంఊట నిల్వ ఉన్న వాటిపై ఎస్ఐ జి.మారుతిశంకర్ సిబ్బందితో కలసి మెరుపు దాడిచేశారు.మండలపరిధిలోని నాగలూటి గ్రామంలో వడ్డేపేటలో (గ్రామంబయట) నందికొట్కూరుకు  చెందిన షికారి శానా అనే వ్యక్తి సారా తయారు చేస్తూ ఉండగా15 లీటర్ల సారాయి,బెల్లంఊట నీటి బిందెలలో 300 లీటర్ల బెల్లం ఊట ఉన్నవాటిని పోలీసులు సారాయి మరియు బెల్లం ఊట బిందెలను కర్రలతో పగలగొట్టి వాటిని కింద పడేశారు.మాకు అందిన సమాచారం మేరకు వాటిపై దాడి చేశామని ఆయన తెలిపారు.సారాయి తయారు చేస్తున్న వ్యక్తి షికారి శానా పైన కేసు నమోదు చేశామని,అతను పరారీలో ఉన్నాడని త్వరలోనే అతనిని అదుపులోకి తీసుకుంటామని ఎస్సైతెలిపారు.ఈకార్యక్రమంలో ఏఎస్ఐ సుబ్బయ్య,హెడ్ కానిస్టేబుల్ పుల్లయ్య,సిబ్బంది హనుమంతు,చెన్నయ్య,మద్దిలేటి,హిమాంస పాల్గొన్నారు.

About Author