PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నందికొట్కూరు నియోజకవర్గంలో యువనేతకు నీరాజనాలు…

1 min read

– రైతులు, రైతు కూలీలు, ఉపాధి హామీ కూలీల కష్టాలు విన్న లోకేష్..

– శ్రీశైలం అసెంబ్లీ నియోజకవర్గంలో యువనేతకు ఘనస్వాగతం..

పల్లెవెలుగు వెబ్  నందికొట్కూరు:  అరాచక పాలనను అంతమొందించడమే లక్ష్యంగా 97వరోజు నందికొట్కూ నియోజకవర్గంలో పాదయాత్ర నిర్వహించిన యువనేత నారా లోకేష్ కు జనం నీరాజనాలు పలికారు. దారిపొడవునా ప్రజలు యువనేతకు నీరాజనాలు పడుతూ తాము ఎదుర్కొంటున్న కష్టాలు చెప్పుకున్నారు. మరో ఏడాదిలో రాబోయే చంద్రన్న ప్రభుత్వం అందరి కష్టాలు తీరుస్తుందని చెప్పి యువనేత ముందుకు సాగారు. బన్నూరు క్యాంప్ సైట్ నుంచి ప్రారంభమైన పాదయాత్ర… కృష్ణారావుపేట, రుద్రవరం, పాములపాడు, కంభాలపల్లి, ఎర్రగూడూరు మీదుగా శ్రీశైలం అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రవేశించింది. శ్రీశైలం అసెంబ్లీ నియోజకవర్గ శివార్లలో యువనేతకు అపూర్వ స్వాగతం లభించింది. శ్రీశైలం ఇన్ చార్జి బుడ్డా రాజశేఖర్ రెడ్డి, సీనియర్ నేత ఏరాసు ప్రతాపరెడ్డి, పార్టీనాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున యువనేతకు ఎదురేగి స్వాగతం పలికారు. పాములపాడులో ఎస్సీలతో సమావేశమైన యువనేత లోకేష్ వారి సాధకబాధకాలను తెలుసుకున్నారు. వివిధ గ్రామాల ప్రజలు, రైతులు, మైనారిటీలు యువనేతకు ఎదురేగి తమ సమస్యలను తెలియజేశారు. 97వరోజు యువనేత లోకేష్ 16.5 కి.మీ పాదయాత్ర చేశారు ఇప్పటివరకు 1239.5 కి.మీ. మేర పాదయాత్ర పూర్తయింది. శ్రీశైలం అసెంబ్లీ నియోజకవర్గంలోని కె.స్టార్ గోడౌన్స్ వద్ద విడిది కేంద్రంలో యువనేత బసచేశారు. 

యువనేత ఎదుట వివిధ వర్గాల సమస్యలు:

పెన్షన్ తీసేసి నా తండ్రి ప్రాణాలు తీశారు.!

-సుద్దమళ్ల మనోహర్, జూటూరు.

నిష్కారణంగా నా తండ్రి పెన్షన్ తీసేయడంతో మనస్థాపం చెంది గత ఏడాది జూన్ లో నా తండ్రి చనిపోయాడు. ఆ తర్వాత ఇప్పటివరకు మా అమ్మ నాగమ్మకు పెన్షన్ ఇవ్వలేదు. కారణం అడిగితే పొలం ఉందని చెబుతున్నారు. మా అమ్మ పేరిట 60 సెంట్లు పొలం ఉంది. ఆమకు ఏ ఆధారం లేదు. నా బిడ్డకు అమ్మఒడి కూడా తీసేశారు. ఇంతటి దుర్మార్గపు ప్రభుత్వాన్ని ఇదివరకెన్నడూ చూడలేదు..

50మంది ఉంటే ఇద్దరికే స్కీమ్ ఇచ్చారు..

-లింగస్వామి, పాములపాడు.

మా గ్రామంలో 50మంది రజకులం ఉన్నాం. కేవలం ఇద్దరికి మాత్రమే ప్రభుత్వ సాయం రూ.10వేలు  అందింది. కారణం అడిగితే ల్యాండ్రీ షాపు ఉంటేనే స్కీమ్ వర్తిస్తుందని చెబుతున్నారు. ఇంటివద్ద కులవృత్తి చేసుకునే మాకు షాపులు ఎలా ఉంటాయి? నిత్యావస వస్తువుల ధరలన్నీ పెరరిగిపోయాయి. సామాన్యుడు బతికే పరిస్థితి లేదు. ఇంతటి చెత్తప్రభుత్వాన్ని గతంలో ఎన్నడూ చూడలేదు.

బుగ్గనగారి దొంగలెక్కలు..

 ఏపీ ఆర్థికశాఖ మంత్రి బుగ్గన దొంగ లెక్కలు బాగా రాస్తాడు. నిధులు కేటాయిస్తాడే తప్ప, ఖర్చు చేయడు. టీడీపీ పరిపాలనలో దళితులకు ఖరీదైన వాహనాలు కొని స్వయం ఉపాధి కల్పించాం. దళిత సంక్షేమానికి రూ.40వేల కోట్లు ఖర్చు చేశాం. 3వేల ఎకరాలు కొనుగోలు చేసి దళితులకు ఇచ్చాం. దళిత విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడానికి బెస్ట్ అవైలబుల్ పాఠశాలలు, ఫీజు రీయింబర్స్ మెంట్ ఇచ్చాం. విదేశీవిద్య పథకాన్ని అమలు చేసి విదేశాల్లో చదివించాం. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఈ పథకాలన్నింటినీ రద్దు చేశాడు. 2014 ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టని పథకాలను కూడా చంద్రబాబు అమలు చేశారు.. 

జగన్మోసపురెడ్డి మాటలకు అర్థాలె వేరులే..

శ్రీశైలం నియోజకవర్గం కరివేములలో అగ్రిగోల్డ్ ఫామ్ ల్యాండ్ వద్ద సెల్ఫీ దిగిన లోకేష్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అబద్దాలు, మోసం, నయవంచన కలగలిసిన మానవరూపాన్ని జగన్మోహన్ రెడ్డి అంటారు. శ్రీశైలం నియోజకవర్గం కరివేను గ్రామంలో అగ్రిగోల్డ్ కు చెందిన ఫామ్ ల్యాండ్ ఇది. ఆగ్రిగోల్డ్ ఆస్తులను మేం బినామీ పేర్లతో కొట్టేశామని అబద్దపు ప్రచారంతో మాపై విషం చిమ్మిన జగన్…అధికారంలోకి వచ్చిన ఆరునెలల అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తామని చెప్పి నాలుగేళ్లు దాటిపోయింది.  ఆరునెలల్లో న్యాయం చేయడమంటే వారంరోజుల్లో సిపిఎస్ రద్దుచేసిన మాదిరిగానేనా జగన్మోసపురెడ్డీ అంటూ ఘాటుగా ప్రశ్నించారు.

టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం వివరాలు:

ఇప్పటి వరకు నడిచిన మొత్తం దూరం 1239.5 కి.మీ.

శుక్రవారం నడిచింది దూరం 16.5 కి.మీ.

98వ రోజు (13.05.2023) పాదయాత్ర వివరాలు..

శ్రీశైలం అసెంబ్లీ నియోజకవర్గం(నంద్యాల జిల్లా)..

సాయంత్రం.

3.30 – కె.స్టార్ గోడౌన్ క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.

3.50 – కరివేనలో స్థానికులతో సమావేశం.

4.30  – ఆత్మకూరు బహిరంగసభలో లోకేష్ ప్రసంగం.

6.30 –  ఆత్మకూరు కోర్టురోడ్డులో లాయర్లతో సమావేశం.

6.40  – ఆత్మకూరు ఎండిఓ ఆఫీసు వద్ద స్వచ్చభారత్ అంబాసిడర్లతో సమావేశం.

6.50 – ఆత్మకూరు గౌడ్ బంక్ సెంటర్లతో వ్యాపారులతో సమావేశం.

7.05 – ఆత్మకూరు ఎస్ బిఐ వద్ద డ్వాక్రా మహిళలతో సమావేశం.

7.25 – నంద్యాల క్రాస్ వద్ద ముస్లింలతో సమావేశం. 

8.30 – బ్రహ్మనాథపురంలో రైతులతో సమావేశం.

9.20 – నల్లకాల్వలో స్థానికులతో మాటామంతీ.

9.40 – చెంచుకాలనీలో స్థానికులతో మాటామంతీ.

9.55 – చెంచుకాలనీ శివారు విడిది కేంద్రంలో బస.

About Author