నందికొట్కూరులో… సామూహిక క్షేత్ర ప్రదర్శన
1 min readపల్లెవలుగు, వెబ్ నందికొట్నూరు: శుక్రవారం కృషి విజ్ఞాన కేంద్రం, యాగంటిపల్లి, పప్పు దినుస్సుల్లో సామూహిక క్షేత్ర ప్రదర్శనలో భాగంగా, నందికొట్కూరు నందు సీనియర్ సైంటిస్ట్ అండ్ హెడ్ ధనలక్ష్మి గారి అదక్షతన, శనగ (NBeG-3) 25 ఎకరాలకు , మినుములు (GBG-1) 25 ఎకరాలకు, విత్తనాలను జాతీయ ఆహార భద్రతా పథకం లో భాగంగా, శాతనకోట మరియు ధమాగట్ల గ్రామాలలో ఎంపిక చేసిన రైతులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించి, ప్రదర్శన క్షేత్రాలకు సరిపడా విత్తనాలు ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమం లో KVK శాస్త్రవేత్తలు సుధాకర్ మరియు రవి గౌడ్ పాల్గొన్నారు.