ఒక్క మెతుకు వదలొద్దు : పూరీ జగన్నాథ్
1 min read
పల్లెవెలుగు వెబ్: ఉన్నది ఒక్కటే జీవితమని, ఒక్క సారే బతుకుతామని దర్శకుడు పూరీ జగన్నాథ్ చెబుతున్నారు. తినేటప్పుడు ఒక్క మెతుకు కూడ వదలకుండా తినాలని సూచిస్తున్నారు. పూరీ మ్యూజింగ్స్ పేరుతో సోషల్ మీడియాలో తన ఐడియాలజీని పంచుకుంటున్న పూరీ జగన్నాథ్.. లిక్ ది బౌల్ అనే కాన్సెప్ట్ గురించి వివరించారు. మనకు అవసరమైన ఆహారాన్నే తీసుకోవాలని, దాని కంటే ఎక్కువగా తీసుకోకూడదని చెప్పారు. బుద్ధిజాన్ని ఆచరించేవారు రోజులో ఎక్కువ గంటలు ఉపవాసం ఉంటారని, అవసరమైనంత ఆహారం మాత్రమే తీసుకుంటారని చెప్పారు. అందరూ అలా చేస్తే ఎంతో ఆరోగ్యంగా ఉంటారని చెప్పారు. అధికంగా ఆహారం తీసుకోవడమే అనర్థాలకు కారణమని ఆయన తెలిపారు. ఆహారం ప్లేట్ లో కాకుండా.. గిన్నెలో తీసుకుని తినాలని చెప్పారు. అప్పుడే ఫుడ్ కంట్రోల్డ్ గా తీసుకుంటామని చెప్పారు. ఆరోగ్యంగా ఉండాలంటే ఇదొక్కటే మార్గమని తెలిపారు.