PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఓర్వకల్ లో.. కురువ సంఘం నూతన సంవత్సరం క్యాలెండర్​ ఆవిష్కరణ

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  సోమవారం ఓర్వకల్ గ్రామం లో ఓర్వకల్ మండల కురువ సంఘం ఆద్వర్యం లో కేక్ కటింగ్ చేసి నూతన కాలమానిని  ఆవిష్కరించడం జరిగింది .ఈ కార్యక్రమం లో జిల్లా ప్రధానకార్యదర్శి ఎం .కే .రంగస్వామి ,మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలోని కులజులందరు సుఖసంతోషాలతో ఉండాలని,పెద్దపాడు సమీపంలో నిర్మిస్తున్న శ్రీ భీరలింగేశ్వరస్వామి నిర్మాణం కోసం అందరు కృషి చేయాలనీ  చెప్పారు .ఈ కార్యక్రమం లో  జిల్లా కోశాధికారి కే .సి .నాగన్న ,మండల కురువ సంఘం గౌరవ అధ్యక్షులు కే .పెద్దయ్య ,మండల అధ్యక్షుడు అల్లబాబు తదితరులు పాల్గొన్నారు .తదనంతరం కర్నూలు నగర మేయర్ బి . వై .రామయ్యని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారిని వెంకటలక్ష్మి ని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపినవారు జిల్లా కురువ సంఘం ప్రధానకార్యదర్శి  ఎం .కే .రంగస్వామి ,కోశాధికారి కే .సి .నాగన్న ,జిల్లా నాయకులు పెద్దపాడు పుల్లన్న ,వెంకటేశ్వర్లు తదితరులు .

About Author