NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పత్తికొండలో.. జనాగ్రహదీక్ష

1 min read

– టీడీపీ నీచస్థితిని ఎండగట్టిన ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి
పల్లెవెలుగు వెబ్​, పత్తికొండ: టిడిపి నేత పట్టాభి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా గురువారం పత్తికొండ వైకాపా 48గంటల దీక్షకు దిగింది. నాలుగు స్తంభాల కూడలి వద్ద ఏర్పాటుచేసిన దీక్ష శిబిరానికి వచ్చిన ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి టీడీపీ నీచమైన రాజకీయ ఎత్తుగడలను ఎండగట్టారు. సుపరి పాలన అందిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పై టీడీపీ శ్రేణులు చేస్తున్న నీచమైన వ్యాఖ్యలను ఆమె ఈ సందర్భంగా ఖండించారు.

ప్రతిపక్ష పాత్ర పోషించలేక చంద్రబాబు ఇలాంటి నీచమైన ఎత్తుగడలను వేయడం లో సిద్ధహస్తుడన్నారు. ప్రజలలో టిడిపి పట్ల ఆదరణ కరువై వైకాపాపై బురద చల్లే చర్యలకు దిగుతున్నారని విమర్శించారు. వచ్చే రెండు సంవత్సరాల్లో ప్రజల వద్దకు పాలన అందించడమే లక్ష్యంగా వైకాపా ముందడుగు వేస్తుందని, చంద్రబాబు చేసే కుట్రలు కుతంత్రాలకు బెదిరేది లేదన్నారు. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి పై పట్టాభి చేసిన వ్యాఖ్యలకు చంద్రబాబు నాయుడు బాధ్యత వహించాలన్నారు. అందుకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని ఆమె కోరారు. 48గంటల దీక్షను వైకాపా జిల్లా ప్రచార కార్యదర్శి శ్రీరంగడు ప్రారంభించి అధ్యక్షత వహించారు. దీక్షలలో పత్తికొండ మండలం లోని గ్రామ సర్పంచులు ఎంపీటీసీలు జడ్పీటీసీలు ఎంపీపీ కూర్చున్నారు.

About Author