NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పెనగలూరులో…టీడీపీ జోష్​..

1 min read

టీడీపీ కార్యాలయం ప్రారంభించిన రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు చమర్తి జగన్ మోహన్ రాజు

పల్లెవెలుగు, అన్నమయ్య జిల్లా బ్యూరో:  అన్నమయ్య జిల్లాలోని    రైల్వే కోడూరు నియోజకవర్గం, పెనగలూరు మండలం నందు నూతన తెలుగుదేశం పార్టీ మండల కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి స్థానిక ఇంచార్జ్ కస్తూరి విశ్వనాధ నాయుడు గారు మరియు జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర గార్లతో కలిసి హాజరై ప్రారంభోత్సవం చేసిన పార్లమెంట్ అధ్యక్షులు శ్రీ చమర్తి జగన్ మోహన్ రాజు అనంతరం నూతన పార్టీ కార్యాలయంలో వేద పండితులచే పూజా కార్యక్రమం నిర్వహించారు .నూతన కార్యాలయ ప్రాంగణం ముందు తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరణ అనంతరం జగన్ మోహన్ రాజు గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి లక్ష్యంగా సమిష్టిగా పనిచేయాలని కోరుతూ రాష్ట్ర అభివృద్ధితోపాటు యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు,అలానే జనేసన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో రాష్ట్ర భవిష్యత్ కోసం,రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కొరకు ప్రతి ఒక్కరం కలిసికట్టుగా రౌడి రాజ్యాన్ని ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు అంతేకాకుండా మహాశక్తి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం,సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం జరుగుతుందన్నారు.ఇలాంటి సంక్షేమ పథకాలను ఎన్నో ప్రవేశపెట్టడం మన అధినేత చంద్రబాబు నాయుడుకి దక్కుతుందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు.రైల్వే కోడూరు నియోజకవర్గ ఇన్చార్జి కస్తూరి విశ్వనాధ నాయుడు గారు మాట్లాడుతూ “బాబు షూరిటీ – భవిష్యత్ గ్యారెంటీ “కార్యక్రమంలో క్లస్టర్ యూనిట్ బూత్ కన్వీనర్లు పాల్గొని పార్టీ సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు  జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర మాట్లాడుతూ సైకో ముఖ్యమంత్రి రాష్ట్రం నుంచి సాగనంపాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, నియోజకవర్గ నాయకులు, మండల పార్టీ నాయకులు,జనసేన నాయకులు, కార్యకర్తలు,అభిమానులు భారీ ఎత్తున పాల్గొన్నారు.

About Author