సి పి ఎస్ స్థానం లో పాత పెన్షన్ విధానాన్ని అమలు లో తేవాలి – ఆప్టా
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రములో మూడు లక్షల మంది కి పైగా వున్న సి పి ఎస్ ఉద్యోగుల ఆకాంక్ష పాత పెన్షన్ విధానం, కానీ ప్రస్తుతం ప్రభుత్వం దానిని కాదని ప్రభుత్వ పెన్షన్ విధానం ను అమలు లోకి తేవటానికి ప్రయత్నం చేయుచున్నది.దేశంలో అరు రాష్ట్రాలలో పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ చేయుటకు ప్రయత్నాలు జర్గుతుంటే మన రాష్ట్రం లో అందుకు వ్యతిరేకంగా చర్యలు చేపడుతున్నారు.ఉద్యోగుల సంక్షేమం కోసమే పనిచేసే ప్రభుత్వం గా రాష్ట్రం లో సి పి ఎస్ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం ను అమలు లోకి తేవటానికి ప్రయత్నం చేయాలి అని ఏ పి ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ (ఆప్టా) సభ్యుల పక్షాన మరియు ఉపాద్యాయ ఉద్యోగుల పక్షాన కోరుతూ నేడు ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ గారికి మరియు ఇతర అధికారులకు నేడు వినతి పత్రం సమర్పించడం జరిగింది.
(ఏ జి ఏస్ గణపతి రావు)రాష్ట్ర అధ్యక్షుడు, (ఎం జి మహాడీ)రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ (కె ప్రకాష్ రావు)
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.