పల్లె వెలుగు వెబ్ : ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గగన్ యాన్ ప్రాజెక్ట్ లో పాల్గొనే వ్యోమగాములకు ప్రత్యేక ఆహార పధార్థాల తయారీ ప్రారంభమైంది. కర్ణాటకలోని మైసూర్ డీఆర్ డీవోకు చెందిన డీఎఫ్ఆర్ఎల్ ఈ ఆహారాన్ని సిద్ధం చేస్తోంది. భూమ్మీద అయితే కూర్చొని లేదా నిలబడి తింటామని, అంతరిక్షంలో గురుత్వాకర్షణ శక్తి వల్ల ఆహార పదార్థాలు గాల్లో తేలుతుంటాయని డీఎఫ్ఆర్ఎల్ శాస్త్రవేత్త మధుకర్ తెలిపారు. అందుకోసం ప్రత్యేకంగా ఆహార పదార్థాలు తయారు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. గగన్ యాన్ లో భాగంగా రోదసిలోకి ముగ్గురూ భారత వ్యోమగాములే వెళ్తున్న కారణంగా భారతీయ వంటకాలే తయారు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. చికెన్ బిర్యానీ, వెజ్ పులావ్, వెజ్ బిర్యానీ, చికెన్ కుర్మా, దాల్ మఖానీ, సాంబార్ అన్నం, సాంబార్ చావల్, రాజ్మా చావల్ తో పాటు ఇతర ఆహార పదార్థాలు కూడ ప్రత్యేకంగా తయారు చేస్తున్నట్టు ఆయన తెలిపారు.