NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

శ్రీ దస్తగిరి స్వామి ఉరుసులో… రాతి దూళం పోటీలు

1 min read

పోటీలను ప్రారంభిస్తున్న టిడిపి రాష్ట్ర మైనారిటీ సెల్‌ ఉపాధ్యక్షుడు అన్సర్‌బాష

పల్లెవెలుగు వెబ్​, చాగలమర్రి: కర్నూలు జిల్లా చాగలమర్రి శివార్లలో వెలసిన కట్ట మీది శ్రీ  దస్తగిరి స్వామీ ఉరుసు సందర్బంగా ఏర్పాటు చేసిన  రాతి దూళం పోటీలను రాష్ట్ర టిడిపి మైనారిటీ సెల్‌ ఉపాధ్యక్షుడు,మాజీ సర్పంచ్ అన్సర్‌బాష ఆదివారం ప్రారంభించారు.ఈ సందర్భంగా నిర్వహకులు,దర్గా కమిటీ సభ్యులు ఆలంసాగారి మౌళాళి,హనీప్‌లు మాట్లాడతూ నంద్యాల,కర్నూలు,కడప జిల్లా ల నుంచి పది జతల వృషభ రాజములు  పాల్గొన్నాయన్నారు.  పోటీలో గెలుపొందిన వాటికి ప్రధమ  బహుమతి రూ 30 వేలు,ద్వితీయ బహుమతి రూ 20 వేలు,తృతీయ బహుమతి రూ 10 వేలు,చతుర్థ బహుమతి రూ 6 వేలు,పంచమ బహుమతి 4 వేల రూపాయల నగదు ను అందజేయడం జరుగుతుందని వారు తెలిపారు.కార్యక్రమంలో టిఎన్‌టియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుత్తి నర్సింహులు, టిడిపి నాయకులు కొలిమి ఉసేన్‌వళి,కొలిమి షరీప్‌,  కొలిమి మహబూబ్‌ భాష,శ్యాబుల్‌,జెట్టి నాగరాజు,ఖలీల్‌,కింగ్‌ హుసేన్‌,గఫార్‌, నాగూర్‌,జెట్టి సుధాకర్‌,టైలర్‌ ఖాదర్‌, టైలర్‌ అమీర్‌,చోటు,మాబులాల్‌,దర్గా కమిటీ సభ్యులు ఆలంసాగారి, రసూల్‌,ఖలీల్‌,లాలుబాష,మాబుసేన్‌,అచ్చుకట్ల బాహుద్దీన్‌,శ్యాబుధ్దీన్‌  తదితరులు పాల్గొన్నారు

About Author