NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

శ్రీశైలంలో ..  నిర్మాణ పనుల పరిశీలించిన చైర్మన్

1 min read

పల్లెవెలుగు వెబ్​: మండలి అధ్యక్షులు చక్రపాణి రెడ్డి డి గణేశ సదన్ నిర్మాణ పనులనుఈ పరిశీలనలో ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు తన్నీరు ధర్మరాజు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధర్మకర్తల మండలి అధ్యక్షుడు చక్రపాణి రెడ్డి  మాట్లాడుతూ ప్రస్తుత జరుగుతున్న గణేశసదన్ ఫినిషింగ్ పనులను వీలైనంత త్వరలో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. తరువాత కొత్త పెట్రోల్ బంకు ఎదురుగాగల డార్మెటరీ హాళ్ళను పిలిగ్రీమ్ షెడ్లను పరిశీలించారు. అదేవిధంగా టాయిలెట్స్ బ్లాకులు (శ్రాచలయాలు, స్నానగదుల సముదాయాలు) నిర్మించేందుకు ప్రతిపాదించిన ఆయా ప్రదేశాలను కూడా అధ్యక్షులు పరిశీలించారు. బాహ్యరహదారి వద్ద గల పార్కింగ్ ప్రదేశాల వద్ద, జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాల వద్ద పాత హెలిప్యాడ్ ప్రాంతం) ఆర్.టి.సి. బస్టాండ్ మొదలైన చోట్ల టాయిలెట్స్ బ్లాకులు నిర్మించాలని ప్రతిపాదించడం జరిగింది. ఈ పరిశీలానంతరం మల్లికార్జునసదనం కూడా ధర్మకర్తల మండలి అధ్యక్షులు పరిశీలించారు. ఈ పరిశీలనలో ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ పి. మురళీబాలకృష్ణ, డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు. నరసింహారెడ్డి, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు రాజారావు, ప్రణయ్ తదితర సిబ్బంది పాల్గొన్నారు.

About Author