శ్రీశైలంలో.. సామాన్య భక్తులకు ఉచిత స్పర్శదర్శనం
1 min read
పల్లెవెలుగు వెబ్, శ్రీశైలం: శ్రీభ్రమరాంబమల్లికార్జున స్వామి వార్ల దర్శనార్థం వచ్చే సామాన్య భక్తులకు… దసరా మహోత్సవాల నుంచి ఉచితంగా స్పర్శదర్శనం ఉండేలా దేవాలయ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దసరా మహోత్సవాలు ప్రారంభమయ్యే అక్టోబరు 7వ తేదీ నుంచి సర్వ భక్తులకు ఉచిత స్వామివార్ల స్పర్శదర్శనం కల్పించబడుతుంది. గతంలో మాదిరిగానే .. వారంలో నాలుగురోజులు మంగళవారం నుంచి శుక్రవారం వరకు క్యూలైన్ భక్తులకు ఉచితంగా స్వామివార్ల స్పర్శదర్శనం కల్పించనున్నారు. నాలుగురోజులలో మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 3.30 గంటల వరకు ఉచితంగా భక్తులకు శ్రీస్వామివార్ల స్పర్శదర్శనాన్ని కల్పించడం జరుగుతుంది. భక్తులు తప్పనిసరిగా సంప్రదాయ దుస్తులతో స్వామివారిని దర్శించుకోవాలని ఆలయ ఈవో లవన్న తెలియజేశారు.