NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

శ్రీశైలంలో.. సంక్రాంతి బ్రహ్మోత్సవాలు

1 min read

పల్లెవెలుగు వెబ్​ : మకర సంక్రమణ పుణ్యకాలాన్ని పురస్కరించుకుని పంచాహ్నిక దీక్షతో ఏడు రోజులపాటు నిర్వహింపబడే సంక్రాంతి బ్రహ్మోత్సవాలు రెండవ   రోజు స్వామి అమ్మవార్లకు విశేషపూజలు జరిపించబడ్డాయి. ఉత్సవాలలో భాగంగానే యాగశాల యందు శ్రీ చండీశ్వర స్వామికి ప్రత్యేక పూజాదికాలు జరిపించబడ్డాయి. అనంతరం లోకకల్యాణం కోసం చతుర్వేద పారాయణలు, జపాలు, రుద్రపారాయణ చేయడం జరిగింది.  తరువాత మండపారాధనలు, పంచావరణార్చనలు, రుద్రహోమం కార్యక్రమాలు ఆగమశాస్త్రం ప్రకారంగా జరిపించబడ్డాయి. అదే విధంగా ఈ సాయంకాలం ప్రదోష కాల పూజలను, హోమాలను జరిపించిన తరువాత జపానుష్టానాలు జరిపించబడతాయి.

భృంగివాహన సేవ : బ్రహ్మోత్సవాలలో నిర్వహించబడే వాహనసేవలలో భాగంగా ఈ రోజు సాయంకాలం శ్రీ స్వామి అమ్మవార్లకు భృంగి వాహనసేవ జరిపించబడుతుంది. ఈ సేవలో శ్రీ స్వామిఅమ్మవారి ఉత్సవమూర్తులను అక్కమహాదేవి అలంకారమండపంలో భృంగివాహనంపై వేంచేపు చేయించి ప్రత్యేక పూజాదికాలు నిర్వహించబడతాయి. తరువాత ఆలయ ప్రాకారోత్సవం జరిపించబడుతుంది. భృంగివాహన సేవ పరమేశ్వరునిపై అఖండ భక్తిని పెంచుకుని ఆయన్ను ఆరాధించిన భక్తుడు భృంగి. ఆయనకు మూడు.. పాదాలు. మూడో పాదం పరమేశ్వరుడు ప్రసాదించిందే. స్వామి అమ్మవార్లలో ఇద్దరూ ముఖ్యమేనని, ఇద్దరినీ సమంగా పూజించాలని తెలియని భృంగి అమ్మవారి శాపానికి గురై రెండు పాదాల్లోనూ శక్తి కోల్పోతాడు. పరమేశ్వరుడు భక్తుడిపై కరుణతో మూడో పాదం అనుగ్రహించాడు. దానితో కోపం వచ్చిన అమ్మవారు కైలాసం I విడిచి పరమేశ్వరునికై తీవ్ర తపస్సు చేసి ఆయన శరీరంలో అర్థభాగమైపోయింది. అదే అర్ధనారీశ్వరవతారం. ఆ అవతారానికి.  ప్రేరకుడు ఈ భృంగి. అందుకే అతని అఖండ భక్తికి గుర్తుగా తొలిరోజు వాహనంగా భృంగి వాహనంపై స్వామి అమ్మవార్లు నిర్వహిస్తారు.

About Author