శ్రీశైలంలో.. శివరాత్రి ఏర్పాట్లు సిద్ధం..
1 min readపల్లెవెలుగు వెబ్, శ్రీశైలం: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో మహాశివరాత్రి పర్వదినంలో భాగంగా భక్తులకు సకల వసతులు సిద్ధం చేశామన్నారు. జాయింట్ కలెక్టర్ ( ఆసరా) ఎంకేవీ శ్రీనివాసులు, ఆలయ ఈఓ లవన్న. శనివారం వారు పలుచోట్ల పర్యటించి మహాశివరాత్రి ఏర్పాట్లను పరిశీలించారు. ముఖ్యంగా పలు ఆరుబయలు ప్రదేశాలలో ఏర్పాటు చేసిన చలువపందిర్లు. నీటిసరఫరా, శివదీక్షా శిబిరాలలో దీక్షా విరమణ, పారిశుద్ధ్యం మొదలైన అంశాలను పరిశీలించారు. బసవవనం, బాలగణేశవనం, శివదీక్షా శిబిరాలు, పుష్కరిణి వద్ద గల శ్రీపర్వతవనం మొదలైనవాటిని వీరు పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ఆరుబయలు ప్రదేశాలలో ఎటువంటి అంతరాయం లేకుండా నిరంతరం నీటిసరఫరా జరుగుతుండాలన్నారు. అదేవిధంగా అన్ని చలువపందిర్లలో కూడా ఎటువంటి అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా జరుగుతుండాలన్నారు. క్షేత్రపరిధిలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి కనబర్చాలని అధికారులను సూచించారు. ముఖ్యంగా చలువపందిర్లు, ప్రధానవీధులు మొదలైనచోట్ల ఎప్పటికప్పుడు చెత్తాచెదారాన్ని తొలగిస్తుండాలన్నారు. అదేవిధంగా ఎటువంటి ఆలస్యం లేకుండా చెత్తచెదారాలను డంప్ పంపే ఏర్పాట్లు కూడా నిరంతరం సంబంధిత అధికారులు పర్యవేక్షిస్తుండాలన్నారు.