PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శ్రీశైలంలో.. ‘ఆకాశదీపం’

1 min read

పల్లెవెలుగు వెబ్​, శ్రీశైలం:కార్తీక మాసం పురస్కరించుకుని శ్రీశైల మహాక్షేత్రంలో ఆకాశదీపాన్ని వెలిగించారు ఈఓ లవన్న. కార్తీక మాసం శివకేశవులకు ఎంతో ప్రియం. ఈ మాసం ప్రారంభం కాగానే దేవాలయాల్లో ధ్వజ స్తంభానికి ‘ఆకాశ దీపం’వెళ్లాడదీస్తుంటారు. చిన్న చిన్న రంధ్రాలు చేయబడిన ఓ గుండ్రని ఇత్తడి పాత్రలో ఆవు నెయ్యి తో ఈ దీపాన్ని వెలిగిస్తారు. ఆకాశదీపం పితృదేవతలకు మార్గాన్ని చూపుతుంది. ధ్వజస్తంభం పైభాగాన వేలాడదీస్తారు. అయితే దీనిని ఆకాశ దీపం అని పిలవడానికి … ధ్వజ స్తంభానికి వేలాడదీయడానికి ఓ కారణం వుంది.

ఆకాశ మార్గాన ప్రయాణించే పితృదేవతల కోసమని కార్తీకపురాణం చెబుతోంది. కార్తీక శుద్ధ పాడ్యమి నుంచి పితృ దేవతలంతా ఆకాశమార్గాన తమ తమ లోకాలకు ప్రయాణం చేస్తుంటారు. ఈ సమయంలో వారికి త్రోవ సరిగ్గా కనిపించడం కోసం ఆలయాలలో ఆకాశ దీపాన్ని వెలిగిస్తుంటారు.

About Author