PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సూర్యదేవాలయంలో…దత్తజయంతి

1 min read

పల్లెవెలుగు వెబ్​:కర్నూలు నగరంలోని సూర్యదేవాలయంలో బుధవారం పౌర్ణమి సందర్భంగా దత్త జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి.  స్వామి జయంతిని పురస్కరించుకుని… తైలాభిషేకములు, దత్త హోమములు అదేవిధంగా కృత్తికా నక్షత్రం సందర్భంగా కావడి సేవలు అభిషేకములు, సుబ్రహ్మణ్య హోమములు నిర్వహించారు.. భక్తాదులు అధిక సంఖ్యలో పాల్గొని తైలాభిషేకములు కావడి సేవలు దత్త సుబ్రహ్మణ్య హోమం నిర్వహించారు. అనంతరం అన్నదాన సేవా వితరణలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు అయ్యారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్​ రామకృష్ణా రెడ్డి, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

About Author