PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సూర్యదేవాలయంలో.. చండీహోమం..

1 min read

కర్నూలు: కర్నూలు నగరంలోని సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానము నందు మంగళవారం అమావాస్య సందర్భంగా భక్తులు  నవగ్రహ, లక్ష్మీ గణపతి, మూల మంత్ర సహిత చండీహోమం నిర్వహించారు. వేదమంత్రోచ్చరణలతో.. భక్తిశ్రద్ధలతో దేవాలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమాలు నిర్వహించారు.  అదేవిధంగా శ్రీ గౌరీ శంకర స్వామి వారికి ప్రాతఃకాలం నుండి రుద్రాభిషేకములు విశేష అర్చనలు నిర్వహించారు. కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. అనంతరం దేవాలయ కమిటీ చైర్మన్​ రామకృష్ణారెడ్డి, సభ్యుల నేతృత్వంలో భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు.

About Author