NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

దేవస్థానాల్లో…‘గుడికో గోమాత ’ అమలు

1 min read

పల్లెవెలుగు వెబ్​, కర్నూలు : తిరుమల తిరుపతి దేవస్థానములు ధర్మ ప్రచార పరిషత్ మరియు శ్రీ వెంకటేశ్వర గోసంరక్షణ శాల ఆధ్వర్యంలో జిల్లాలోని నాలుగు దేవాలయాలు గోవత్స సహిత నాలుగు గోవులను మంజూరు చేశారు. ఆళ్ళగడ్డ లోని శ్రీచౌడేశ్వరీ దేవి ఆలయం, రుద్రవరం మండలం ముత్తలూరు గ్రామం లోని శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం, కోడుమూరు ఎస్సీ కాలనీ లోని శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానం,గోనెగండ్ల మండలం, హెచ్‌ కైరవాడి గ్రామంలోని శ్రీ గోమాత ఆలయాలకు గోవత్ససహిత గోవులను  ఆయా ఆలయాల నిర్వాహకులకు అందించారు.   గో సంరక్షణే ధ్యేయంగా గుడికో గోమాత పథకం  గోవు భారత జాతి అపురూపమైన సంపదని అటువంటి గోవును కాపాడుకునేందుకు తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ గుడికో గోమాత పథకం క్రింద  దరఖాస్తు చేసుకున్న ఆయా ఆలయాల నిర్వాహకులకు అందించుటకు సిద్దంగా ఉన్నదని తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో తితిదే ధర్మాచార్యులు టి.వి.వీరాంజనేయరావు, తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణ శాల వెటర్నరీ అసిస్టెంట్ దాసరి వెంకట్రావు, ఎరసప్పగారి మోహన్ రెడ్డి, ఉమాపతి, నారాయణ రెడ్డి, కృష్ణయ్య, శ్రీ లక్ష్మిచెన్నకేశవస్వామి దేవస్థానం ఆలయకమిటీ అధ్యక్షులు ఎస్.శ్రీనివాసులు,కె.భీముడు, కె.పెరమల్లయ్య,పి.రంగమునెయ్య, కె.దాసు, కె.మునిస్వామి కె.కృష్ణ,కె.కేశన్న, జి.కృష్ణయ్య, జి.మాధవస్వామి, ఎస్. పాండురంగ,కె.మద్దిలేటి, కె.విష్ణుదాసు, ఎస్.  రామాంజనేయులు, బెళగళ్ మునిస్వామి,కె.చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

About Author