ఆ దేశంలో.. వారానికి నాలుగు రోజులే పని !
1 min readపల్లెవెలుగు వెబ్: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి తమ దేశంలో వారంలో నాలుగు రోజులే పనిదినాలుగా ప్రకటించింది. వారాంతాన్ని కూడా మునుపటి శుక్ర,శనివారాలు నుంచి శని, ఆదివారాలకు మార్చింది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం.. శుక్రవారం మధ్యాహ్నం నుంచి వీకెండ్ ప్రారంభం అవుతుంది. వచ్చే ఏడాది జనవరి నుంచి కొత్త విధానం అమల్లోకి వస్తుందని అధికారులు తెలిపారు. ప్రభుత్వ సంస్థలు, విభాగాలన్నీ ఈ పద్ధతిని తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. ఇటువంటి నిర్ణయం తీసుకున్న తొలిదేశంగా యూఏఈ చరిత్ర సృష్టించింది.