కూటమి ప్రభుత్వంలో..రోడ్లు కళ కళ
1 min read
ప్రభాకర్ ను అభినందించిన జేఎస్పీ కేంద్ర కార్యాలయం
మిడుతూరు (నందికొట్కూరు) న్యూస్ నేడు : కూటమి ప్రభుత్వం వచ్చాక (టీడీపీ, జనసేన,బిజేపీ) కూటమి ప్రభుత్వంలో పల్లె రోడ్లు కళ కళ లాడుతున్నాయి.నంద్యాల జిల్లా మిడుతూరు మండల కేంద్రం నుండి దేవనూరు, చౌటుకూరు మీదుగా ఓర్వకల్లు వరకు 20 కిలో మీటర్లు తారు రోడ్డు వేయడంతో పల్లె గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఈ సందర్భంగా జనసేన పార్టీ మిత్రుల మండల యువకులు గుడిపాడు ప్రభాకర్ తారు రోడ్డు పనులను పరిశీలిస్తూ ముఖ్యమంత్రి మరియు ఉప ముఖ్యమంత్రి చంద్రబాబు,పవన్ కళ్యాణ్ సారాధ్యంలో రహదారులతో పాటు ప్రయాణికులు ప్రజలు వాహనాలు ప్రశాంతంగా ఇంటికి చేరుకునే విధంగా రోడ్లను నందన వనంగా తీర్చి దిద్దుతున్నారని అన్నారు. ప్రయాణికులు వాహనాలు వెళ్లాలంటే ఇంత వరకు రోడ్లు గుంతలు గుంతలుగా అద్వాన్నంగా ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే వారిని అన్నారు. ప్రభాకర్ జనసేన పార్టీ సభ్యత్వంలోనూ మరియు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నందుకు గాను జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నుండి ప్రభాకర్ ను ఫోన్ ద్వారా అభినందించారు.ఈ కార్యక్రమంలో రాజు యుగంధర్,నాని,శంకర్ పాల్గొన్నారు.