కరోన కట్టడిలో.. రాష్ట్ర ప్రభుత్వం విఫలం
1 min read– టీడీపీ కడప నియోజకవర్గ ఇన్చార్జ్ అమీర్‌బాబు
పల్లెవెలుగు వెబ్, కడప బ్యూరో: కరోన కేసులు నియంత్రణలో.. ప్రజల ప్రాణాలు కాపాడటంతో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని టీడీపీ కడప అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జ్ వీఎస్ అమీర్‌బాబు ఆరోపించారు. నగర శివారులోని రిమ్స్ వద్ద పదో రోజు ఆదివారం కోవిడ్ బాధిత కుటుంబ సభ్యులకు అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ కరోనా మహమ్మారి ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తున్న ఈ విపత్కర పరిస్థితులలో కోవిడ్ బాధితుల వెంట వచ్చే వారికి అన్నదాన కార్యక్రమం చేపట్టడం ఒక దైవ కార్యమని అన్నారుకర్ఫ్యూ . కరోనా వేళ ఇరుగుపొరుగు వారు నోరుతెలిచి సహాయం అడగలేని అభాగ్యులను గుర్తించి.. సహాయం చేయాలని, ఇది అందరూ బాధ్యతగా భావించాలన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.