శైలపుత్రి అలంకారంలో.. భ్రమరాంబ దేవి
1 min readపల్లెవెలుగు వెబ్, శ్రీశైలం: దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం శ్రీశైల భ్రమరాంబ దేవి అమ్మవారు శైలపుత్రి స్వరూపంలో దర్శనమిచ్చారు. ద్విభుజాలను కలిగిన ఈ దేవి కుడిచేతిలో త్రిశూలం, ఎడమచేతిలో పద్మాన్ని ధరించి ఉంటుంది. నవదుర్గాలలో ప్రథమ రూపమైన అమ్మవారిని పూజించడం వల్ల విశేష ఫలితాలు కలగడంతో పాటు సర్వత్రా విజయాలు లభిస్తాయని చెప్పబడుతోంది. ముఖ్యంగా ఈ దేవీ ఆరాధన వలన ముత్తైదువులకు ఐదవ తనం వృద్ధి చెందుతుందని చెప్పబడుతోంది.
ఉత్సవాలలో భాగంగా శ్రీస్వామి అమ్మవార్లకు నిర్వహిస్తున్న వాహనసేవలలో భాగంగా భృంగివాహనసేవ నిర్వహించారు. వాహనసేవలో శ్రీ స్వామి అమ్మవారి ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరింపజేసి భృంగి వాహనంపై వేంచేబు చేయించి పూజాదికాలు చేయబడుతాయి. కార్యక్రమంలో ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ఆలయ అధికారులు ఈవో లవన్న పాల్గొన్నారు.