PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

దేశ అభివృద్ధిలో…‘చేనేత’ల పాత్రకీలకం…

1 min read

జౌళిశాఖ మంత్రి శంకర్​పటేల్​, ఎంపీ రాజా అమ్రేష్​ నాయక్​

‘పది’, ఇంటర్​ సెకండియర్​లో మెరిసిన చేనేత విద్యార్థులకు ప్రశంస పత్రం అందజేత…

పల్లెవెలుగు వెబ్​: సైనికులు… చేనేతలు.. దేశానికి రెండు కళ్లు లాంటి వారని, సైనికులు దేశాన్ని కాపాడితే… చేనేతలు బట్టల ద్వారా మానాన్ని కాపాడుతున్నారని అభివర్ణించారు జౌళిశాఖ మంత్రి శంకర్​ పటేల్​, ఎంపీ రాజా అమ్రేష్​ నాయక్​. ఆదివారం రాయచూరు పండిత్​ సిద్ధరామ జమ్మలదిన్ని రంగ మందిరంలో పదో తరగతి, ఇంటర్మీడియేట్​ సెకండియర్​ అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రశంసపత్రం అందజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన  జౌళిశాఖ మంత్రి శంకర్​పటేల్​, ఎంపీ రాజ​అమ్రేష్ నాయక్​ తోపాటు  చేనేతల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బి.ఎస్​. సోమశేఖర్ , చేనేతల సంఘం బెంగుళూరు అధ్యక్షుడు కె. నారాయణ మాట్లాడారు. దేశ అభివృద్ధిలో చేనేతల పాత్ర కీలకం అని, చేనేత రంగ అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాధాన్యమిస్తుండటం సంతోషించదగ్గ విషయమన్నారు. విద్యార్థులు మేధస్సు పెంచుకుని… దేశ పురోగతిలో భాగస్వామ్యం కావాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు.  ఉత్తమ ప్రతిభ చూపిన చేనేత విద్యార్థులకు  శుభాకాంక్షలు తెలియజేశారు.

  • ప్రతిభకు… పురస్కారం..
  • కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లాలో అత్యుత్తమ మార్కులు సాధించిన పదో తరగతి, ఇంటర్​ సెకండియర్​ విద్యార్థులకు ప్రతిభ పురస్కారం అందజేశారు.  విద్యార్థులకు ప్రశంసపత్రం, అవార్డు ఇచ్చి ఘనంగా సన్మానించారు. అనంతరం చేనేత కుల సంఘం పెద్దలను శాలువా కప్పి సత్కరించారు. కార్యక్రమంలో  పార్లమెంట్​ సభ్యులు ఎస్​. కేశవ ప్రసాద్​, రాయచూరు ఎమ్మెల్యే డా.ఎస్​. శివరాజ్​ పటేల్​,  పార్లమెంట్​ సభ్యులు ఎన్​ఎస్​ బోస్​రాజ్​, రాయచూరు ఎమ్మెల్యే డా. శివరాజ్​పటేల్​, రాయచూరు రూరల్​ ఎమ్మెల్యే బసవనగౌడ్​ దద్దల్ , దేవదుర్గ ఎమ్మెల్యే కె.శివన్న గౌడ నాయక్​,  మాన్వి ఎమ్మెల్యే రాజ అమ్మేష్​ నాయక్​, సింధనూరు ఎమ్మెల్యే వెంకటరావు నార గౌడ, లింగశూరు ఎమ్మెల్యే  డి.ఎస్​. వులగేరి, మస్కి ఎమ్మెల్యే బసవన్న గౌడ సుబిహాల్​ , రాయచూరు మున్సిపల్​ చైర్మన్ లలిత కడుగోర ఆంజనేయ, ​ మాజీ ఎంపీ, చేనేతల సంఘం కర్ణాటక రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు  కె.సి. కొండయ్య,  బళ్లారి,  చేనేతల సంఘం కర్ణాటక రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఎండి లక్ష్మినారాయణ,  కర్ణాటక మాజీ మంత్రి, ఉమాశ్రీ, గంగావతి ఎమ్మెల్యే మల్లికార్జున నాగప్ప, రాయచూరు మాజీ ఎమ్మెల్యే ఎ.పాపిరెడ్డి, హిందువు సమాజ్ అధ్యక్షుడు కె.శాంతప్ప, పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు, రాయచూరు పెనగొండ్ల గోవిందరాజులు, చేనేతల సంఘం రాయచూరు జిల్లా అధ్యక్షుడు కర్లి ఈరన్న, జి. నాగరాజు, మాన్వి , మంజునాథ్​, బిచ్చాల, హెచ్​. వెంకటేష్​, బసవరాజ్​ అనుమగొండ్ల, చంద్రశేఖర్​ గుల్బర్గా,  సోమశేఖర్​, అమలాపురి బీదర్​, రామచంద్ర జయదుర్గా, శివశంకర్​ కుమార్​ మాన్వి, కాలప్ప సింధనూరు, శ్రీధర్​ కిరిగి లింగశూరు, మల్లికార్జున కుచ్చ మస్కి, శ్రీనివాస మేకర్​ తిరువార్​, పద్మశాలి సంఘం రాయచూరు సభ్యులు చిన్ని మునిచంద్ర,  పులిపాటి నాగేష్​, కర్లి ప్రభు,  మెటికల​ నరసింహులు రాయచూరు, క్యామ ఆంజనేయులు, పులిపాటిమహదేవ్​, కొడగంటి శరనప్ప, కొడగంటి బూదెప్ప, పురుషోత్తం సవరప్ప తదితరులు పాల్గొన్నారు.

About Author