ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న రాంపురం రెడ్డి కుటుంబం
1 min readపల్లెవెలుగు వెబ్ కౌతాళం : మండల పరిధిలో అయినటువంటి కార్యక్రమం నిర్వహించగా,మ్యాళిగనూరు,నదిచాగి గ్రామంలో మండల నాయకులు రామన్నగౌడ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి తరుపున వారి సతీమణి జయమ్మ,కూతురు ప్రియాంక రెడ్డి,సీతారామిరెడ్డి కూతురు వీనమ్మ, ప్రదీప్ రెడ్డి బార్య అనూషమ్మ శ్రీ రామలింగేశ్వర సన్నిధిలో ప్రత్యేక పోజలు నిర్వహించిన అనంతరం రెండు గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి వైఎస్ఆర్సీపీ దేశంలో ఎక్కడా లేని విధంగా పేదలకు సంక్షేమం అందించిన జగన్ ప్రభుత్వాన్ని మరొక్క సారి ఎంపీ,ఎమ్మెల్యే అభ్యర్థులకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు,మంత్రాలయంలో ప్రతి పల్లెల్లో బాలనాగి రెడ్డి గారి గురించి తెలుసని ప్రజలకోసం నిరంతరంగా శ్రమించే శ్రామికుడు మన ఎమ్మెల్యే బాలానాగిరెడ్డి గారిని మరొక్కసారి అందరూ కలిసి ఆశీర్వదించి అత్యధిక మెజారిటీ అందించాలని ప్రదీప్ రెడ్డి సతీమణి అనూష ఓటర్లను కోరారు,టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు చేయకపోగా ఇప్పుడు అదిచేస్తా ఇదిచేస్తా అని ప్రజలను మోసం చేసేందుకు మళ్ళీ అపద్దపు హామీలతో మీ దగ్గరకు వచ్చి అడుక్కుంటున్నారు,మీ దగ్గరకు వచ్చిన టీడీపీ వాళ్లకు చెప్పండి జగన్ మాకు అమ్మవడి, రైతుభరోస,వైఎస్ఆర్ చేయూత,చేదోడు, గోరుముద్ద, నాడునేడు ద్వారా ప్రభుత్వ బడుల అభివృద్ధి,పొదుపు సంఘాల రుణాల మాఫీ,వృద్దులకు ఇంటి వద్దకే పెన్షన్ అందించడమే కాకుండా సచివాలయం ద్వారా ప్రజల గడపకు పాలన వాలంటీర్ ద్వారా అందిస్తున్నారు కదా ఇవన్నీ మీరు గతంలో ఎందుకు అందించలేక పోయారని నిలదీయాలని జయమ్మ ఓటర్లను కోరారు,టీడీపీ ప్రభుత్వం వృద్దులకు ఇంటివద్దకే పెన్షన్ల ఇస్తుంటే వాటిని అడ్డుకోవడం వృద్ధులను పెన్షన్ల కోసం సచివాలయం వద్ద పడిగాపులు కాస్తున్న వృద్ధుల ఉసురు తగలకుండా పోదు కచ్చితంగా టీడీపీ,జనసేన బీజేపీ పార్టీలకు తగిన బుద్ది చెబుతారని ప్రియాంక రెడ్డి తెలిపారు,మేము అధికారంలో వచ్చిన వెంటనే మళ్ళీ వాలంటీర్ వ్యవస్థలను కొనసాగించి అన్ని పథకాలను ఇంటీవద్దకే వాలంటీర్లు వచ్చి అందిస్తారని హామీ ఇచ్చారు.వారివెంట నదిచాగి రామన్నగౌడ,లింగన్నగౌడ,మండల కన్వీనర్ దేశాయ్ ప్రహల్లాద్ స్వామి,నాగరాజ గౌడ,మాబుసాబు,బుజ్జిస్వామి,వల్లూరు మరెగౌడ,చన్నప్పధని,లింగలదిన్ని లింగనగౌడ,అవాతారం,భీమేష్,పాల్ దినకర,తిక్కయ్య బగ్గూరగౌడ,జంబనగౌడ,అనిల్,సోమశేఖర గౌడ,బసప్ప,ముదేగౌడ,ముదెప్పగౌడ, ముదుకప్పగౌడ,నాగేష్,హనుమంత,దేవరెడ్డి,కాంతయ్య, రమేశ గౌడ,కురువ ఆదెప్ప,ఆంజనేయ,వివిధ గ్రామాల నాయకులు,కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.