తండ్రి అడుగుజాడల్లో సీఎం వైఎస్ జగన్ … ఎమ్మెల్యే
1 min readపల్లెవెలుగు వెబ్ పత్తికొండ : రైతుల సంక్షేమం కోసం స్వర్గీయ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి అడుగుజాడల్లో ఆయన కుమారుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నడుస్తున్నాడని ఎమ్మెల్యే శ్రీదేవమ్మ అన్నారు. గురువారం తుగ్గలి లోని జూనియర్ కళాశాలలో క్రిష్ణగిరి, వెల్దుర్తి ,తుగ్గలి , మద్దికేర ,పత్తికొండ మండలాల చెందిన నిరుపేదలు ప్రభుత్వ భూములలో వ్యవసాయం చేసుకునేందుకు పట్టాదార పాస్ పుస్తకాలను ఎమ్మెల్యే శ్రీదేవమ్మ , ఆర్డీవో రామలక్ష్మి గారితో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా 5 మండలాల నుంచి వచ్చిన పేదరైతుల్ని ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఆనాడు స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డి రైతుల సంక్షేమం ,అభివృద్ధి కోసం భూములను పంపిణీ చేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం జగనన్న కూడా పేదలకు పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేయడం జరిగిందన్నారు. గతంలో ఎస్సీ కార్పొరేషన్ కింద కొనుగోలు చేసిన భూములు, అలాగే ప్రభుత్వం పంపిణీ చేసిన భూములు పై కూడా సర్వహకులు కల్పించడం జరిగిందన్నారు. అంతేకాక రైతుల అభివృద్ధి కోసం ఉచిత పంట ఇన్సూరెన్సు, 0 వడ్డీ రుణాలు, రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారని అన్నారు. ముఖ్యంగా పత్తికొండ ప్రాంతంలో రైతుల అభివృద్ధి కోసం రూ 12 కోట్లతో టమోటా ప్రాసెస్ యూనిట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేశారని తెలిపారు. అందువల్ల జగనన్న ప్రభుత్వాన్ని మరోసారి ప్రజలందరూ ఆశీర్వదించాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్రీనివాసరావు, ఆర్డిఓ రామలక్ష్మి , తహసిల్దార్ లు వైఎస్ఆర్సిపి నాయకులు డిప్యూటీ తాసిల్దార్ లు ,ఆర్ ఐ లు,వీఆర్వోలు తదితరులు పాల్గొన్నారు.