PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

డీజీపీ చేతుల మీదుగా…

1 min read
డీజీపీ చేతుల మీదుగా అవార్డు అందుకుంటున్న ఎస్పీ ఫక్కీరప్ప, పెద్దకడబూరు ఎస్​ఐ శ్రీనివాసులు

డీజీపీ చేతుల మీదుగా అవార్డు అందుకుంటున్న ఎస్పీ ఫక్కీరప్ప, పెద్దకడబూరు ఎస్​ఐ శ్రీనివాసులు

ఉత్తమ అవార్డు అందుకున్న ఎస్పీ, పెద్దకడబూరు ఎస్​ఐ
పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: రాష్ట్రంలో అత్యుత్తమ పోలీస్​ స్టేషన్​గా పెద్దకడబూరు పీఎస్​ ఎంపికైనందుకు కర్నూలు జిల్లా ఎస్పీ కాగినెల్లి ఫక్కీరప్ప, పెద్దకడబూరు ఎస్​ఐ శ్రీనివాసులును అభినందించారు డీజీపీ గౌతం సవాంగ్​. ఎపి హెడ్ క్వార్టర్ విజయవాడ / మంగళగిరిలో రాష్ట్ర డిజిపి గౌతమ్ సవాంగ్ ఐపియస్ చేతుల మీదుగా సర్టిఫికెట్ ఆఫ్ ఎక్సలెన్సీ అవార్డును జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఐపియస్, పెద్ద కడబూరు ఎస్సై శ్రీనివాసులకు అందజేశారు. జాతీయ స్ధాయిలో అత్యంత ప్రతిష్టాత్మక అవార్డును జిల్లా ఎస్పీ డా. ఫక్కీరప్ప అందుకోవడం అభినందనీయమని కలెక్టర్​ జి. వీరపాండియన్​ ప్రశంసించారు. ఇదే స్పూర్తిని కొనసాగిస్తూ పోలీసింగ్ లో ఆధునిక టెక్నాలజీని వినియోగించి లా అండ్ ఆర్డర్ ను పకడ్బందీగా నిర్వహిస్తూ ప్రజల మన్నలను పొందాలని కలెక్టర్​ ఆకాంక్షించారు.

About Author