PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మనిషి గుండెలో…‘ కుక్క బద్దె పురుగు తిత్తి’

1 min read

శస్ర్త చికిత్సతో తొలగించిన ‘ గౌరి గోపాల్​’ వైద్యులు

పల్లెవెలుగు, కర్నూలు: కలుషిత నీరు… ఉడికి ఉడకని మాంసం..ఆహారం.. తీసుకోవడం వల్ల ఓ మనిషి గుండెలో హైడాటెడ్​ సిస్ట్​ ( బుడగల వంటి తిత్తులు) ఏర్పడి ప్రాణానికే ప్రమాదం ఏర్పడింది. అది తెలియక గుండె నొప్పితో బాధపడుతూ .. కడపలోని కార్డియాలజిస్ట్​ డా. వంశీ దగ్గరకు వెళ్లగా … రోగి గుండెలో హైడాటెడ్​ సిస్ట్​( బుడగల వంటి తిత్తులు) ఉన్నట్లు గుర్తించారు. మెరుగైన వైద్యం కోసం కర్నూలులోని గౌరిగోపాల్​ ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు. ఇక్కడ ఆపరేషన్​ చేసి రోగిని కాపాడినట్లు కార్డియాలజి స్పెషలిస్ట్​ డా. లక్ష్మణ స్వామి తెలిపారు.  శనివారం  గౌరిగోపాల్​ హాస్పిటల్​ ఛాంబరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో  ఆయన వివరాలు వెల్లడించారు.  కడప జిల్లా చింతకొమ్మ దిన్నె గ్రామానికి చెందిన  57 ఏళ్ల షేక్​ మహబూబ్​ బాష గత కొంత కాలంగా గుండె నొప్పితో బాధపడుతున్నాడు. కడపలోని  కార్డియాలజిస్ట్​ డా. వంశీ చికిత్స చేయగా ..గుండెలో హైడా టెడ్​ సిస్ట్​ లు ఉన్నాయని, మెరుగైన వైద్యం కోసం కర్నూలు గౌరి గోపాల్​ ఆస్పత్రికి రెఫర్​ చేశారు. ఇక్కడ మెరుగైన చికిత్స చేయగా దాదాపు 50 హైడాటెడ్​ సిస్ట్​లు ఉన్నట్లు గుర్తించి… తొలగించారు. రోగి పూర్తిగా కోలుకున్నాడు.

జబ్బు.. అరుదు..

 ఇది ఒక జునాటిక్​ జబ్బు. జంతువుల జబ్బు మనుషులకు వస్తే… జునాటిక్​ జబ్బు అంటారు.  కుక్క పేగులో పెరిగే బద్దె పురుగు పెరిగి… వాటి జీవ పదార్థం కుక్క మలంలో  విసర్జితమవుతాయి.ఆ మలంతో కలిసిన ఆకులు, కూరగాయలు, నీరు తాగడం వల్ల గొర్రెలకు ఈ ఇన్​ఫెక్షన్​ వస్తుంది. మనిషి అలాంటి కలుషితమైన ఆహారం.. నీరు, ఉడకని మాంసం తీసుకోవడం వల్ల  ఈ ఇన్​ఫెక్షన్​ మనిషికి సోకే ప్రమాదం ఉంది.  సాదారణంగా ఈ ఇన్​ఫెక్షన్​ సోకి పదేళ్లైనా పేషెంట్​ బాగానే ఉంటాడు. ఈ తిత్తులు సైజ్​ పెరిగే కొద్ది రోగం బయటకు కనిపిస్తుంది. లివర్​కు.. కొన్ని కేసులలో లంగ్స్​/ ఊపిరితిత్తులకు, మెదడుకు  ఈ తిత్తులు రావచ్చు. గుండెకు అరుదుగా వస్తుంది.

జబ్బు రాకుండా ఉండాలంటే..

  1. కలుషిత మాంసం, ఆహారం, నీరు తీసుకోరాదు.
  2. బాగా ఉడికించిన ఆహారం మాత్రమే తీసుకోవాలి.
  3. కుక్కలు పెంచే వారు తప్పనిసరిగా వాక్సిన్లు,  డీ వర్మింగ్​ ట్రీట్మెంట్​ కుక్కలకు ఇప్పించాలి.

About Author