ఆస్పత్రి టాయిలెట్ లో.. ప్రసవించిన బాలిక !
1 min readపల్లెవెలుగు వెబ్ : అత్యాచారానికి గురై గర్భం దాల్చిన ఓ బాలిక ఆస్పత్రి టాయిలెట్ లో ప్రసవించింది. ఈ ఘటన కేరళలోని కొచ్చిలో జరిగింది. 24 ఏళ్ల యువకుడు అత్యాచారం చేయడంతో ఆ బాలిక గర్భం దాల్చింది. దీంతో ఆమె తల్లి .. ఆ బాలికను ఆస్పత్రికి తీసుకొచ్చింది. ఆస్పత్రిలో టాయిలెట్ కి వెళ్లిన ఆ బాలిక అక్కడే ప్రసవించింది. అనంతరం పిండాన్ని టాయిలెట్ లోకి నెట్టి నీటిని ఫ్లష్ చేసింది. టాయిలెట్ వెళ్లి మరో వ్యక్తి ఆ పిండం అవశేషాల్ని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. తాను అకాల శిశువుకు జన్మనిచ్చి టాయిలెట్ లో వేశానని ఆ బాలిక పోలీసుల ఎదుట చెప్పింది. ఆ బాలిక తల్లి ఫిర్యాదు మేరకు ఆ యువకుడిని ఫోక్సో చట్టం కింద అరెస్టు చేసి కేసు నమోదు చేశారు.