కోవిడ్ కట్టడిలో.. ‘104’ పాత్ర కీలకం
1 min readకాల్ సెంటర్ను పరిశీలించిన కలెక్టర్
పల్లెవెలుగు వెబ్, విజయవాడ : కోవిడ్ భాదితులకు వైద్య సేవలు, సూచనలు అందించడంలో 104 కాల్ సెంటర్ పాత్ర కీలకం అని కలెక్టర్ ఏ ఎండి ఇంతియాజ్ తెలిపారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం ఆవరణలో ని 104 కాల్ సెంటర్ ను ఆదివారం కలెక్టర్ తనిఖీ చేశారు. కోవిడ్ స్ట్రెయిన్ , బ్లాక్ ఫంగస్ కేసుల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని, కాల్ సెంటర్కు వచ్చే ప్రతి ఫిర్యాదుకు పరిష్కారం చూపాలని కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ అధికారులను ఆదేశించారు. సుమారు 75 మంది 3 షిఫ్టుల్లో పనిచేస్తున్నారని, ప్రతి రోజు 500 నుంచి 550 కాల్స్ వరకు వొస్తున్నాయని అసిస్టెంట్ కలెక్టర్ ఎస్ ఎస్ శోభిక కలెక్టర్కు వివరించారు. హోం ఐసోలేషన్లో ఉన్న వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నామని, ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తున్న వారికి.. డాక్టర్లతో మాట్లాడిస్తున్నామన్నారు. ప్రతి కాల్ కి టికెట్ రైజ్ చేసి, పరిష్కరించడానికి చర్యల్లో భాగంగా సిబ్బంది ఏద్వారా పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు. కలెక్టర్ తనిఖీ ల్లో సోషల్ వెల్ఫేర్ డిడి సరస్వతి, డ్యూటీ డాక్టర్లు, అధికారులు, సిబ్బంది హాజరయ్యారు.