PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అమెరికా దిగువ స‌భ‌లో.. భార‌త్ కు అనుకూలంగా నిర్ణ‌యం

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : అమెరికా ప్రతినిధుల సభ(దిగువ సభ)లో భారత్‌కు అనుకూలంగా కీలక అడుగు పడింది. అమెరికా విరోధులను ఎదుర్కొనే ఆంక్షల చట్టం-కాట్సా నుంచి భారత్‌ను మినహాయిస్తూ రూపొందించిన సవరణ చట్టానికి సంబంధించిన బిల్లు పాసైంది. ఇండియన్‌ అమెరికన్‌, డెమొక్రటిక్‌ పార్టీ చట్టసభ సభ్యుడు ఆర్‌వో ఖన్నా ప్రవేశ పెట్టిన ఈ సవరణ ప్రతిపాదనను మూజువాణి ఓటుతో దిగువసభ సభ్యులు ఆమోదించారు. ఫలితంగా రష్యా నుంచి భారత్‌ ‘ఎస్‌-400’ క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేసే ఒప్పందానికి మార్గం సుగమమైంది. దీంతో పొరుగు దేశం చైనా దూకుడును కట్టడి చేసేందుకు భారత్‌కు అవకాశం లభించినట్టు అయింది. గురువారం అమెరికా జాతీయ రక్షణ ఆథరైజేషన్‌ చట్టం(ఎన్‌డీఏఏ)పై చర్చలో భాగంగా ప్రవేశ పెట్టిన ఈ సవరణ చట్టానికి సభ్యులు ఆమోదం తెలిపారు.

                                  

About Author