PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నాని సినిమాలో .. మ‌రో హీరో

1 min read

నాని హీరోగా రాహుల్ సాంకృత్యన్ ద‌ర్శక‌త్వంలో తెర‌కెక్కుత‌న్న చిత్రం ‘ శ్యామ్ సింగ్ రాయ్ ’ బెంగాల్ నేప‌థ్యంలో సాగే యాక్షన్ క‌థా చిత్రం శ్యామ్ సింగ్ రాయ్. ఈ సినిమా పోస్టర్లు ఇప్పటికే మంచి క్రేజ్ ను తెచ్చిపెట్టాయి. నాని గెట‌ప్.. బ్యాక్ గ్రౌండ్ సినిమా మీద ఆశ‌లు పెంచుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ఈ సినిమాకి సంబంధించిన మ‌రో విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. ఈ సినిమాలో నాని తో పాటు మ‌రో హీరో న‌టిస్తున్నారు. అత‌నెవ‌రంటే.. హీరో, ద‌ర్శకుడు రాహుల్ ర‌వీంద్రన్. ఇటీవ‌ల కింగ్ నాగార్జున‌తో గ్రీకువీరుడు సినిమా తెర‌కెక్కించారు రాహుల్ ర‌వీంద్రన్. ఇప్పుడు నాని సినిమాలో రెండో హీరో గా న‌టిస్తున్నట్టు ఆయ‌న ఇటీ వ‌ల ట్వట్టర్ లో పేర్కొన్నారు. ఈ సినిమాలో హీరోయిన్లుగా సాయి ప‌ల్లవి, కృతి శెట్టి, మ‌డొన్నా సెబాస్టియ‌న్ న‌టిస్తున్నారు. మిక్కీ జే మేయ‌ర్ సంగీతం అందిస్తున్నారు. మ‌రి రాహుల్ ర‌వీంద్రన్ పాత్ర ఎలా ఉండ‌బోతోంది. లుక్స్ ఎలా ఉండ‌బోతున్నాయో తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే.

About Author