PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆసరా పేరుతో.. మహిళలకు టోకరా: డా. మాచాని సోమనాథ్

1 min read

మున్సిపల్ 7,8,9 వార్డులలో.. “బాబు షూరిటీ -భవిష్యత్తుకు గ్యారెంటీ” పై ఇంటింట ప్రచారం నిర్వహించిన డా. మాచాని సోమనాథ్

చంద్రబాబు సీఎం కావాలని గద్దెరాళ్ళ మారెమ్మ గుడిలో.. డా. మచాని సోమనాథ్ ప్రత్యేక పూజలు

పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు :  ఎమ్మిగనూరు పట్టణంలోఆసరా పేరుతో. మహిళా పొదుపు సంఘాలకు టోకరా పెట్టిన ఘనత ముఖ్యమంత్రి జగన్ దేనని టిడిపి నాయకులు డాక్టర్ మాచాని సోమనాథ్ తెలిపారు. బుధవారం ఎమ్మిగనూరు పట్టణంలో ఎస్సీ కాలనీలో మునిసిపల్ 7,8,9 వార్డుల పరిధిలో గల క్రాంతి నగర్, ఎరుకల కాలనీ, డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ కాలనీ ల యందు “బాబు షూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ”కార్యక్రమాన్ని ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అఖండ మెజార్టీతో గెలిచి నారా చంద్రబాబు నాయుడు  ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ ఎరుకల కాలనీలో నూతనంగా వెలసిన గద్దె రాళ్ల మారెమ్మ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ కాలనీలో.. పరిశుద్ధాత్మ చర్చి నందు పాస్టర్ యోహోశివ సోమనాథ్ గారిపై ప్రత్యేక ప్రార్థనలు చేశారు.ఈ సందర్భంగా డాక్టర్ మాచాని సోమనాథ్ మాట్లాడుతూ… ముఖ్యమంత్రి జగన్ పాదయాత్ర సమయంలో.. డ్వాక్రా రుణాలు రద్దు చేస్తామని హామీ ఇచ్చి గద్దెనెక్కిన అనంతరం ఎస్సీ, ఎస్టీ,బీసీ,మైనార్టీ లకు అన్యాయం చేశారని ఆవేదన చెందారు. జగన్ రెడ్డి “దగా” విధానంతో.. కేవలం 25 శాతం మందికే లబ్ధి చేకూరిందన్నారు. నాడు చంద్రన్న పాలనలో.. పసుపు కుంకుమ రుణమాఫీ ద్వారా ఒక్కో డ్వాక్రా మహిళలకు రూ.20 వేలు చొప్పున సమానంగా అందించారని గుర్తు చేశారు. డ్వాక్రా మహిళల పొదుపు నిధి రూ.8700 కోట్లు మళ్లించి అభయ హస్తం 2100 కోట్లు జగన్ సర్కారు స్వాహా చేసిందని ఆరోపించారు. జగన్ కు ఓటు వేసినందుకు ప్రజలు పశ్చాతాపం పడుతున్నారని, చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేయడానికి ఎన్నికల కోసం ప్రజలు ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కదిరికోట ఆదెన్న, మాజీ జిల్లా వక్ఫ్ బోర్డు డైరెక్టర్ జి.అల్తాఫ్, ఎస్సీ కాలనీ టిడిపి నాయకులు రోజా ఆర్ట్స్ ఉసేని,ఎరుకల మారెన్న,సప్లయర్స్ బంగారప్ప, కంపాడు చిన్న రంగన్న,యస్. సాల్మన్,టి.ఈరన్న,జె.జైపాల్, పందికోన సురేష్, మైనార్టీ నాయకులు జబ్బర్, గోరా బాష, ఆఫ్గాన్ వలి భాషా తదితరులు ఉన్నారు.

About Author