NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పేరుకే కాపలాదారు.. చేసింది..దొంగతనం..!

1 min read

పల్లెవెలుగు, వెబ్​ మహానంది : పేరుకే కాపలాదారు …..చేసింది.. మాత్రం దొంగతనం .వివరాల్లోకి వెళితే మహానంది క్షేత్రం లో పనిచేసే ఓ కాంట్రాక్టు సిబ్బంది ఒకరు శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహానంది ఆలయానికి మరియు ప్రాకారాల కు డెకరేషన్ చేయడం జరిగింది .రాత్రి విధులు నిర్వహించే ఒక కాపలాదారు డెకరేషన్ కు సంబంధించిన వైర్లను దొంగిలించినట్లు విశ్వసనీయ సమాచారం .ఉత్సవాల చివరి రోజున ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది .దీనిపై డెకరేషన్ వేసే వ్యక్తి దేవస్థానం కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఆలయ అధికారులు దీనిని గోప్యంగా ఉంచినట్లు సమాచారం .విమర్శలు వెల్లువెత్తడంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని తాత్కాలికంగా పక్కన పెట్టినట్లు తెలుస్తుంది .దీనిపై ఆలయ అధికారులు గుంభనంగా వ్యవహరించడం తీవ్ర విమర్శలకు తావిస్తుంది .కాపలా ఉండాల్సిన వ్యక్తి ఇలాంటి సంఘటనలకు పాల్పడడం ఏమిటని పలువురు పలు రకాలుగా చర్చించుకుంటూ ఉన్నట్లు తెలుస్తుంది .దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారని పలువురు ప్రశ్నిస్తున్నారు.


About Author