ట్రూ ఆఫ్ పేరుతో.. ప్రజలపై భారం: సీపీఐ
1 min read– విద్యుత్ చార్జీలు తగ్గించాలని రస్తారోకో
పల్లెవెలుగు వెబ్, ఆస్పరి: ట్రూ ఆఫ్ చార్జి పేరుతో రాష్ట్ర ప్రజలపై విద్యుత్ చార్జిలు పెంచడం అన్యాయమని, వెంటనే చార్జిలు తగ్గించాలని డిమాండ్ చేశారు సీపీఐ జిల్లా సమితి సభ్యులు నాగేంద్ర, మండల కార్యదర్శి విరుపాక్షి. రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా గురువారం ఆస్పరి విద్యుత్ కార్యాలయం ముందు సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల పై అదనపు భారం ఒక యూనిట్ కి ఒక రూపాయి 23 పైసలు వసూలు చేస్తోందని, ఈ అదనపు ఛార్జి ట్రూ ఆఫ్ చార్జీ లను ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని విద్యుత్ ఏఈ కి అందజేశారు. కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి కృష్ణమూర్తి, సిపిఐ సీనియర్ నాయకులు బ్రహ్మయ్య, శివన్న, కృష్ణ , నాగరాజు, రంగన్న, ఆంజనేయ, రాముడు, ఏఐవైఎఫ్ నాయకులు హనుమంతు, రంగస్వామి, ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.