శాంతిమార్గంలోనే… దైవాన్ని చేరుకుంటాం.. :బిషప్ జయరావు
1 min readపల్లెవెలుగు వెబ్, ఏలూరు: క్రైస్తవుల పవిత్ర ఆరాధ్య రోజుగా గుడ్ ఫ్రైడే ను దైవజనులు నమ్ముతుంటారు,ఆర్ సి ఎం కేతోట్రోలిక్ ఆధ్వర్యంలో స్థానిక విజయ విహార్ సెంటర్ పెయింట్ సెయింట్ తెరిసా ప్రాంగణం నుండి సిలువ మార్గాన్ని ముందుగా ఏలూరు పీఠాధిపతులు బిషప్ జయరావు పొలిమేర సిలువ మార్గాన్ని ప్రారంభించి ముందుకు సాగుతూ అడుగులు వేశారు.ఆయన వెంట క్రైస్తవ జనులు,దైవ సేవకులు ఫైర్ స్టేషన్ సెంటర్ మీదుగా,ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి మార్గము నుండి,అమీనా పేట మీదుగా సెయింట్ ఆన్స్ కళాశాల మార్గం నుండి బిషప్ హౌస్ వరకు క్రైస్తవ జనులు స్తుతి గీతాలు ఆలపిస్తూ సిలువను మోస్తూ ఆనాడు ఏసుక్రీస్తు శిలువను మోస్తూ తాను అనుభవించిన శ్రమలను గుర్తుచేసుకుంటూ దుక్క సాగరంతో తుదివరకు కొనసాగారు,సిలువ మార్గంలో సెయింట్ జోసఫ్ డెంటల్ కాలేజీ కరస్పాండెంట్ జి మోజెస్,జే వి ఆర్ నగర్ విచారణ గురువులు ఫాదర్ ఐ మైఖేల్,మరియు ప్రొక్రియేటర్లు,మత కన్యలు, సిస్టర్ , సంఘ కాపరులు,పెద్ద ఎత్తున పాల్గొని క్రీస్తు సిలువ మార్గంలో కొనసాగారు.