PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పిఓఎల్ఆర్ రీ సర్వేలో.. సమస్యలుంటే తెలియజేయండి

1 min read

– జేసీ (రైతు భరోసా ,రెవిన్యూ) రామసుందర్ రెడ్డి
పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: పి ఓ ఎల్ ఆర్ రీ సర్వే పూర్తయిన గ్రామాల భూవివరాలు పక్కాగా తప్పులు లేకుండా రికార్డులలో నమోదు చేసి ఉన్నతాధికారులకు సమర్పించాలని జాయింట్ కలెక్టర్ (రైతు భరోసా మరియు రెవిన్యూ) రామసుందర్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం స్థానిక రైతు శిక్షణ కేంద్రం నందు పిఓఎల్ఆర్ రీ సర్వే పై సమీక్ష సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో నంద్యాల సబ్ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్, కె ఆర్ ఆర్ సి డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాస్, కర్నూలు ఆర్డిఓ హరి ప్రసాద్, ఆదోని ఆర్ డి ఓ రామకృష్ణారెడ్డి, ఏడీ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ హరికృష్ణ, డిప్యూటీ తాసిల్దార్ లు, విలేజ్ సర్వేయర్లు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ (రైతు భరోసా మరియు రెవిన్యూ) రామసుందర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో కర్నూలు డివిజన్ సంబంధించి కల్లూరు మండలం, పంది పాడు గ్రామం, నంద్యాల డివిజన్ సంబంధించి నంద్యాల మండలం, బిల్ల లాపురం గ్రామం, ఆదోని డివిజన్ సంబంధించి ఆలూరు మండలం కాత్రికి గ్రామం, పై మూడు పైలెట్ విలేజెస్ నందు పి ఓ ఎల్ ఆర్ రీ సర్వే పూర్తయిందన్నారు. ఈ మూడు గ్రామాల రీ సర్వే స్క్రూటినీ చేసి ఫైనల్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందని ఇందుకు సంబంధించి భూ వివరాలు రెవెన్యూ రికార్డులలో పక్కాగా చేయాలన్నారు. ఈ సందర్భంగా తరువాత జరిగే పి ఓ ఎల్ ఆర్ రీసర్వే కు సంబంధించి తీసుకోవాల్సిన సూచనలు సలహాలు ఇచ్చారు.

About Author