మల్లన్న సన్నిధిలో కేంద్ర గ్రామీణాభివృద్ధి కార్యదర్శి నాగేంద్రనాథ్ సిన్హా ..
1 min readపల్లెవెలుగు వెబ్, శ్రీశైలం: శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను కేంద్ర గ్రామీణాభివృద్ధి కార్యదర్శి నాగేంద్రనాథ్ సిన్హా భక్తిశ్రద్ధలతో బుధవారం సాయంత్రం దర్శించుకున్నారు. శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల దర్శనార్థం ఆలయం వద్దకు విచ్చేసిన కేంద్ర గ్రామీణాభివృద్ధి కార్యదర్శి నాగేంద్రనాథ్ సిన్హాను దేవస్థాన కార్యనిర్వహణాధికారి లవన్న అర్చకస్వాములు, వేద పండితులు ఆలయ మర్యాదలతో రాజగోపురం వద్ద స్వాగతం పలికి కేంద్ర గ్రామీణాభివృద్ధి కార్యదర్శి నాగేంద్రనాథ్ సిన్హాను ఆలయంలోకి తీసుకువెళ్లి స్వామి అమ్మవార్లను దర్శనం చేయించారు. అదేవిధంగా స్వామి వారికి అభిషేకంతో పాటు అమ్మవారికి కుంకుమార్చన చేయించారు.
అనంతరం అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఆశీర్వచన మండపంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి కార్యదర్శి నాగేంద్రనాథ్ సిన్హాకు అర్చక స్వాములు, వేద పండితులు వేద మంత్రాలతో ఆశీర్వచనాలు పలికి తీర్థప్రసాదాలు అందించారు. దేవస్థాన ఈవో లవన్న స్వామివారి శేషవస్త్రాలను, ప్రసాదాలను, స్వామి అమ్మవార్ల జ్ఞాపికను అందించి కేంద్ర గ్రామీణాభివృద్ధి కార్యదర్శి నాగేంద్రనాథ్ సిన్హాకు అందజేశారు. అదేవిధంగా ఉదయం జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. జెడ్పి సీఈఓ వెంకటసుబ్బయ్య, డిఆర్డిఏ పిడి వెంకటేశులు, తదితరులు కలరు.