NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

శ్రీ మద్ది ఆంజనేయ స్వామి సన్నిధిలో రాష్ట్ర పౌర సరఫరాలశాఖ మంత్రి, ఎమ్మెల్యే

1 min read

– ఆలయ మర్యాదలతో ప్రత్యేక పూజలు జరిపిన
– ఈవో కొండలరావు, ధర్మకర్త మండలి సభ్యులు

పల్లెవెలుగు వెబ్ జంగారెడ్డిగూడెం: ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామములో వేంచేసియున్న శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి దేవస్థానమునకు ఈ రోజు శ్రీ స్వామి వారి దర్శనార్దం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మాత్యులు కారుమూరి నాగేశ్వరరావు మరియు చింతలపూడి శాసనసభ్యులు వి.ఆర్.ఎలీజా విచ్చేసి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించినారు. అనంతరం వీరికి ఆలయ ముఖ మండపం నందు వేద ఆశీర్వచనం గావించి శ్రీ స్వామి వారి శేష వస్త్రములతో సత్కరించి, స్వామి వారి చిత్రపటమును బహుకరించారు. వీరితో పాటు జంగారెడ్డిగూడెం జడ్పిటిసి సభ్యులు పోల్నాటి బాబ్జీ, స్త్రీ శిశు సంక్షేమ రీజనల్ అద్యక్షురాలు వందనపు సాయిబాల పద్మ , గురవాయిగూడెం సర్పంచ్ గుబ్బల సత్యవేణి, జడ్పిటిసి కొయ్యా రామారెడ్డి, మరియు ఇతర రాజకీయ ప్రముఖులు విచ్చేసినారు. ఈ కార్యక్రమములో ఆలయ ధర్మకర్తలు మానికల బ్రహ్మానందరావు, బల్లే నాగలక్షి, పాములపర్తి యువరాణి, పరపతి భాగ్యలక్ష్మి మరియు ప్రత్ర్యక ఆహ్వానితులు కర్పూరం రవి పాల్గొనినారు అని ఆలయ ధర్మకర్తల మండలి అద్యక్షురాలు కీసరి సరిత విజయ భాస్కరరెడ్డి మరియు ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు ఒక ప్రకటనలో తెలిపారు.

About Author